తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీకి చేరింది.ఇందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశం కానున్నారు.
ఇందులో భాగంగా మధ్యాహ్నం మూడు గంటలకు అగ్రనేత రాహుల్ గాంధీతో ఇద్దరు నేతలు భేటీ కానున్నారు.ఆయనతో పాటు ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే మరియు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులను జూపల్లి, పొంగులేటి కలవనున్నారు.
ఈ క్రమంలోనే ఖమ్మం సభకు రాహుల్, ప్రియాంకను నేతలు ఆహ్వానించనున్నారని సమాచారం.కాగా ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు హస్తినకు చేరుకున్నారు.







