నటి త్రిషకి( Actress Trisha ) ఈమధ్య టైం బాగున్నట్లుగా లేదు వివాదాల మీద వివాదాలు చుట్టుముడుతున్నాయి.సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి ఫామ్ లో ఉన్న త్రిష ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేయలేక పోతుంది.
ఎందుకంటే మొన్నటికి మొన్న మన్సూర్ అలీ ఖాన్ ( Mansoor Ali Khan )ఘటన అయితే ఇప్పుడు తాజాగా మరొక రాజకీయ పార్టీ నాయకుడు త్రిష మీద నోరు పారేసుకుంటున్నాడు.అసలు విషయంలోకి వెళ్తే తాజాగా తమిళనాడు ఏఐఐడిఎంకే పార్టీకి చెందిన ఏవీ రాజు( AV Raju ) అనే మాజీ నాయకుడు త్రిష మీద నోరు పారేసుకోవటం కలకలం రేపుతుంది.
భారీ మొత్తంలో సొమ్ము మొట్ట చెప్పడం గురించి మాట్లాడుతూ దాని గురించి అనవసరంగా కామెంట్ చేయడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు భగ్గుమంటున్నాయి.అసలు రాజు ఏమన్నారంటే గతంలో గౌవత్తూరులో( Gauvattur ) త్రిష ఒక ఫంక్షన్ కి హాజరైంది, స్థానిక ఎమ్మెల్యే త్రిషపై మనసు పడ్డాడు ఒక రోజుకి 25 లక్షలు చెల్లించి త్రిషతో గడిపాడు దానికి నేనే సాక్ష్యం అంటూ ప్రకటించాడు.

ఈ వివాదంపై త్రిష ట్విట్టర్ వేదికగా భగ్గుమంది.మనుషులు ఇంత దిగజారి ప్రవర్తిస్తారని ఎప్పుడు అనుకోలేదని చట్టపరమైన చర్యలకు వెళుతున్నట్లు చెప్పింది.ఇండస్ట్రీ వర్గాలు సైతం త్రిషకి బాసటగా నిలిచాయి.గతంలో మన్సూర్ అలీ ఖాన్ లియో సినిమాలో త్రిష తో నటించడం గురించి అభ్యంతర కామెంట్లు చేసి దుమారం రేపటం చూసాం.
ఆమెకు మద్దతుగా మాట్లాడినందుకు చిరంజీవి కుష్బూ తదితరుల మీద కేసు పెట్టి కోర్టు చేత చివాట్లు తిన్న ఘనత కూడా ఆయనకే చెల్లింది.

ఈ విషయంలో చిరంజీవితో పాటు ఇండస్ట్రీ వర్గాలు ప్రేక్షకులు కూడా త్రిషకి పూర్తిగా మద్దతు తెలిపారు.పొన్నియన్ సెల్వన్ నుంచి వరుస అవకాశాలతో త్రిష బిజీగా మారింది.చిరంజీవి, కమల్ హాసన్ వంటి అగ్ర హీరోలతో ప్యాన్ ఇండియా మూవీస్ లో భాగమవుతుంది.
ఇప్పుడు కూడా ఆమె చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి ఉన్నాయి అందులో ఒకటి చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర.అందుకే కొందరు ఓర్వలేక ఇలాంటి దిగజారుడు పనులు చేస్తున్నట్లు సమాచారం.







