ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది.ఈ క్రమంలో ప్రధాన పార్టీలకు చెందిన నేతలు అందరూ ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.
ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ ప్రచార సభలో పాల్గొననున్నారు.అదేవిధంగా పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు జరగనున్నాయి.
అదేవిధంగా రేపు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు.ఈ క్రమంలోనే కరీంనగర్ రాజీవ్ చౌక్ లో ప్రచారం చేయనున్న రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు.
తమ మ్యానిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గానూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయని తెలుస్తోంది.







