భారతదేశంలోని చాలా మంది బైక్ రైడర్లు హెల్మెట్ ధరించకుండా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తారు.అలా చేసినందుకు రూ.1,000 వరకు జరిమానా విధించవచ్చు.ఐతే ఒక బైకర్ తన హెల్మెట్‌ను పికాచు బొమ్మతో ( Pikachu figure helment )కవర్ చేసి ఫన్నీగా మార్చుకున్నాడు.
ఆపై దాన్ని ధరించి రోడ్లపై తిరగడం మొదలుపెట్టాడు.ఆ సమయంలో ఒక పోలీసుల కంటపడ్డాడు.బైక్‌ను ఆపి అతని హెల్మెట్‌ను క్యూరియాసిటీతో పోలీసులు చెక్ చేశారు.ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బైకర్ తొడుక్కున్న హెల్మెట్ కవర్ చెవులను సూచిస్తూ, ఇది కుందేలు కదా? అని పోలీస్ ఆఫీసర్ ప్రశ్నించారు.ఆపై హెల్మెట్ ధరించినందుకు అతనిని అభినందించారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్‌లో ఈ వీడియోకి లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.పోలీసు, బైకర్‌ను ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు చేశారు.ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించిన హెల్మెట్ వీడియో ఇది మాత్రమే కాదు.ఈ ఏడాది ఆగస్టులో మరొక బైకర్ తన బన్నీ హెల్మెట్‌తో ఒక పోలీసు ఆఫీసర్‌ను ఆకట్టుకున్నాడు.
దానికి చెవులు కూడా ఉన్నాయి.బైకర్ భారతదేశంలోని హైదరాబాద్‌లో రైడింగ్ చేస్తున్నాడు.
హెల్మెట్లు( Helmets ) బైక్ నడిపేవారికే కాకుండా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో నివసించే వారికి కూడా ఉపయోగపడతాయి.2019లో, జపాన్ పార్లమెంట్ నుంచి వచ్చిన ఒక వీడియో భూకంపం సంభవించినప్పుడు శిధిలాల నుంచి రక్షించడానికి మంత్రులకు, ఇతర అధికారులకు ఫోల్డబుల్ హెల్మెట్లను ఎలా అందించారో చూపించింది.మొత్తం మీద హెల్మెట్ ప్రజల ప్రాణాలను కాపాడడంలో చాలా హెల్ప్ అవుతూ బెస్ట్ లైఫ్ సేవింగ్ ఎక్విప్‌మెంట్‌గా నిలుస్తోంది.