నేడు జనసేన పార్టీ(Janasena party) పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన కేడర్ ఫుల్ జోష్ లో ఉంది.ఈ క్రమంలో నేడు మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు.
మరి కొద్ది సేపట్లో సభ స్టార్ట్ కానున్న తరుణంలో విజయవాడ నుంచి పవన్ వారాహి వాహనంపై ర్యాలీగా బయలుదేరనున్నారు.అయితే ర్యాలీకి అనుమతి లేదని కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా (SP Joshua)స్పష్టం చేశారు.
మరోవైపు పవన్ వారాహి వాహనం(Varahi vehicle) వెనకాల భారీగా బైక్ ర్యాలీ నిర్వహించడానికి జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది.అయితే ర్యాలీకి చివరి నిమిషంలో పోలీసులు షాక్ ఇవ్వటంతో జనసేన నాయకులు అయోమయానికి గురవుతున్నారు.

కృష్ణా జిల్లా ఎస్పీ ర్యాలీకు అనుమతి లేదని తెలపటంతో విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు హై టెన్షన్ వాతావరణం నెలకొంది.పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.జనసేన పార్టీని స్థాపించి పది సంవత్సరాలు కావస్తున్న క్రమంలో ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.అయితే వారాహి వాహనంపై పవన్ ర్యాలీగా వస్తారని ముందుగానే తెలియజేయడం జరిగింది.
అయితే సరిగ్గా కార్యక్రమం కొద్ది గంటలలో ప్రారంభం అవుతున్న తరుణంలో… ర్యాలీకి అనుమతులు లేదని పోలీసులు తెలియజేయడం సంచలనంగా మారింది.







