హైదరాబాద్‎లో సినిమా థియేటర్లకు పోలీసుల నోటీసులు

హైదరాబాద్ లోని సైబరాబాద్ పరిధిలో పలు సినిమా థియేటర్ల యజమానులకు పోలీసులు నోటీసులు అందించారు.

తప్పనిసరిగా థియేటర్ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

లైసెన్సులు రెన్యువల్ చేసుకోకుంటే చట్ట పరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.సినిమా థియేటర్లలో భద్రతా ప్రమాణాలు పాటించాలని వెల్లడించారు.

రద్దీగా ఉండే రోడ్లపై ఉన్న థియేటర్లు టైమ్ షెడ్యూల్ పాటించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.థియేటర్ల ఎదుట ట్రాఫిక్ జామ్ అవకుండా చూసుకోవాలని, వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పారు.

ఆ హీరో రూపాయి కూడా తీసుకోలేదు.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : దిల్ రాజు
Advertisement

తాజా వార్తలు