సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. కారణమేంటంటే?

టాలీవుడ్ హీరోలలో ఒకరైన సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జి దగ్గర జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో సాయి ధరమ్ తేజ్ చికిత్స చేయించుకుంటున్నారు.

వెంటిలేటర్ పై సాయి ధరమ్ తేజ్ చికిత్స పొందుతున్నాడని 48 గంటల వరకు అబ్జర్వేషన్ లో ఉంచుతామని వైద్యులు చెబుతున్నారు.సాయి ధరమ్ తేజ్ కు ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదని వైద్యులు వెల్లడించారు.

అయితే పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశారు.రాత్రి 8 గంటల 5 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

పోలీసులు ఐపీసీ 184, 336 మోటార్ వాహనాల యాక్ట్ కింద నిర్లక్ష్యంగా వాహనం నడిపాడని, ర్యాష్ డ్రైవింగ్ చేశాడని కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.సీసీ ఫుటేజీని ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తుండటం గమనార్హం.108 సిబ్బంది ప్రమాదం గురించి పోలీసులకు తెలియజేసినట్లు తెలుస్తోంది.సాయి ధరమ్ తేజ్ కు కన్ను, పొట్ట, ఛాతీ భాగాలలో గాయాలు అయ్యాయని సమాచారం.

Advertisement
Police Filed Case Against Sai Dharam Tej Why Because , Case Filed, October 1st,

ముగ్గురు డాక్టర్లతో కూడిన వైద్య బృందం సాయి ధరమ్ తేజ్ కు చికిత్స అందిస్తోంది.సాయి ధరమ్ తేజ్ కు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారని అల్లు అరవింద్ మీడియాకు తెలిపారు.

మొదట మెడికవర్ ఆస్పత్రిలో సాయి ధరమ్ తేజ్ కు చికిత్స జరగగా ఆ తర్వాత జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి సాయి ధరమ్ తేజ్ ను తరలించారు.

Police Filed Case Against Sai Dharam Tej Why Because , Case Filed, October 1st,

సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని మెగాభిమానులు పూజలు చేస్తున్నారు.సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.దేవా కట్టా ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఈ సినిమా అక్టోబర్ నెల 1వ తేదీన రిలీజ్ కానుందని తెలుస్తోంది.

రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు