దురాశతో అంబూలెన్స్ సిబ్బంది చేసిన పని తెలిస్తే ఛీ అంటారు.. ?

ప్రమాదంలో ఉన్న వారికి కాసింత సహయం చేద్దామని ఆలోచించే రోజులు క్రమక్రమంగా మాయం అవుతున్నాయి.

ఎదుటి వారు చావుబ్రతుకుల మధ్య ఉన్నా కూడా వారి దగ్గర విలువైన వస్తువులు ఉంటే వాటిని దోచుకుపోతున్నారే గానీ పాపం ప్రాణాలు కాపాడుదాం అని ఆలోచించే వారు చాల తక్కువ మంది ఉన్నారు.

ఇకపోతే మంగళవారం తెల్లవారు జామున రామగుండం సమీపంలోని మల్యాలపల్లి క్రాసింగ్ వద్ద కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.ఈ ప్రమాదంలో ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారం వ్యాపారులు తెలంగాణలోని మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాలకు బంగారు ఆభరణాలు సరఫరా చేస్తుంటారు.

వీరు ప్రయాణిస్తున్న ఈ కారు ప్రమాదానికి గురైంది.అదే సమయంలో వీరి వద్ద ఉన్న 3.5 కిలోల బంగారం మాయం అయ్యిందట.దీంతో పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రమాదం జరిగిన చోటు నుండి ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించిన అంబూలెన్స్ సిబ్బందిని విచారించగా వారే దురాశతో ఈ నేరానికి పాల్పడ్డారని తేలిందట.కాగా వారి నుంచి 2 కిలోల 100 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారట.

Advertisement
ఇది కదా ట్రెండ్ అంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వంటమనిషి సీవీ

తాజా వార్తలు