ఢిల్లీ మెట్రో అయినా, ఇండియన్ రైల్వేస్ రైలు అయినా ప్రస్తుతం అంతా ఇన్‌స్టా రీల్స్ ట్రెండ్ నడుస్తోంది.బహిరంగ ప్రదేశాల్లో చాలా మంది యువతులు డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
ఇంకొందరు ఎంతో పవిత్రంగా భావించే దేవాలయాల్లోనూ రీల్స్ చేస్తున్నారు.అయితే ఈ రీల్స్( Reels ) కొందరికి ఇబ్బందికరంగా మారుతున్నాయి.
ఇన్‌స్టా రీల్స్ పేరుతో కొందరు యువతులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు పబ్లిక్ ప్రదేశాల్లో డ్యాన్స్( Dance ) చేస్తున్నారు.
అంతేకాకుండా రద్దీగా ఉండే రైళ్లు, బస్సులలో కొందరు అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నారు.ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓ యువతి రద్దీగా ఉండే ఓ లోకల్ ట్రైన్‌లో( Local Train ) డ్యాన్స్ చేసింది.ఆమెతో పాటు ఓ పోలీస్ కానిస్టేబుల్( Police Constable ) కూడా డ్యాన్స్ చేశాడు.ఇద్దరూ ఉత్సాహంగా లోకల్ ట్రైన్‌లో స్టెప్పులు వేశారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.రైళ్లు, బస్సులు, బహిరంగ ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు.ఇలా చాలా చోట్ల యువతులు డ్యాన్స్ చేస్తున్నారు.
అయితే ఆ ప్రాంతంలో పోలీసులు ఉంటే వెంటనే డ్యాన్స్ మానేసి వెళ్లిపోతున్నారు.ఇక కొందరు యువతులు డ్యాన్స్ చేస్తుండగా పోలీసులు వారిని అడ్డుకుని చీవాట్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే ముంబై లోకల్ ట్రైన్‌లో ఆసక్తికర ఘటన జరిగింది.
ఓ యువతి లోకల్ ట్రైన్‌లో ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది.అంతలో అక్కడే ఉన్న పోలీసును చూసి డ్యాన్స్ ఆపేసింది.తర్వాత పోలీసుతో మాట్లాడి డ్యాన్స్ చేయగా, ఆమెతో పాటు ఆ పోలీస్ కానిస్టేబుల్ కూడా డ్యాన్స్ చేశాడు.
ఈ ఇద్దరూ ఉత్సాహంగా పాటకు స్టెప్పులు వేశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇద్దరూ చాలా చక్కగా డ్యాన్స్ చేశారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.మరో వైపు కొందరు విమర్శలు కూడా వ్యక్తం చేశారు.
ఇలా పోలీసులే ఎంకరేజ్ చేస్తుంటే ఇక యువతులు డ్యాన్స్ చేయడం ఆపరని పేర్కొంటున్నారు.