భారత దేశ కూరగాయ పంటలలో ఒకటి బీన్స్ పంట( beans ).ఇందులో పీచు పదార్థం, విటమిన్ B సమృద్ధిగా ఉండడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది.
బీన్స్ పంట సాగు చేయడానికి మధ్యస్థ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది.అంటే ఉష్ణోగ్రత 15 నుంచి 30 డిగ్రీల వరకు ఉంటే మంచిది.
నేల యొక్క పీహెచ్ విలువ 5 నుండి 6 వరకు ఉండాలి.నీటి సదుపాయం ఉండే ఎటువంటి నెలలైనా బీన్స్ పంటకు అనుకూలంగానే ఉంటాయి.
కొండ ప్రాంతాల్లో అయితే ఫిబ్రవరి, మర్చి నెలలో విత్తు కోవాలి.సాధారణ పొలాలలో అయితే అక్టోబర్, నవంబర్ నెలలలో విత్తుకోవాలి.
ఇక వేసవిలో( summer ) ఆఖరి దుక్కిలో ఎకరాకు ఐదు టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి.మట్టిని మెత్తగా దున్నిన తర్వాత 10 సెంటీమీటర్ల ఎత్తు, 100 సెంటీమీటర్ల వెడల్పు ఉండేలాగా మడులను ఏర్పాటు చేసుకోవాలి.
మడుల మధ్య దూరం దాదాపు 80 సెంటీమీటర్లు ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి.

తరువాత 50 కేజీల వేపపిండి, ట్రైకోడెర్మా హర్జియనం 2.5 కేజీలు, 1.5 కేజీల పాసిలోమైసిస్ లిలసినస్ లను ఒక మిశ్రమం లాగా కలిపి, ఎప్పుడు తేమ ఉండేలాగా జాగ్రత్త తీసుకొని నీడలో ఓ పది రోజులపాటు అలాగే ఉంచితే బయో ఏజెంట్లు వృద్ధి చెందుతాయి.ఇక ప్రధమ ఎరువుల విషయానికి వస్తే ఒక ఎకరాకి నాలుగు కేజీల అమ్మోనియం సల్ఫేట్, 40 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లను కలిపి మడులపై చల్లాలి.

ఎకరాకు 12 కిలోల విత్తనాలను తీసుకొని, విత్తడానికి నాలుగు గంటల ముందు కిలో విత్తనాలకు థైరం 75% DS నాలుగు గ్రాములతో శుద్ధి చేసుకోవాలి.విత్తుకోవడానికి ముందే పందిరి కట్టలను మడులపై ఏర్పాటు చేసుకోవాలి.ఇక మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు వరుసల మధ్య 50 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తనాలను నాటాలి.
ఇక డ్రిప్ విధానం( Drip method ) ద్వారా నీటిని తడులు అందించాలి.పంటను ఇప్పటికప్పుడు గమనిస్తూ చీడపీడల బెడద ను మొదటిలోనే సాధారణ మందులతో పిచికారి చేసి నివారించుకోవాలి.







