తెలంగాణ గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌కు కేంద్ర బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రధాని మద్య నెలకొన్న రచ్చ అంతాఇంతా కాదు.కేంద్రంపై విరుచుకుపడడమే కాకుండా అవినీతి ఆరోపణలతో కేసీఆర్ మోడీని ఏకిపారేసిన విషయం విధితమే.
వరి కొనుగోలు విషయంలో మొదలైన రాజకీయ యుద్ధం నేటికీ కొనసాగుతూనే ఉంది. బీజేపీపై ఏకంగా యుద్ధమే ప్రకటించిన కేసీఆర్ ఆ పార్టీని బంగాళాఖాతంతో కలిపేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.
దీనికి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ వ్యూహమే కారణమని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు.అలాగే ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పనిచేస్తున్నానని, ఏడేండ్లుగా మా ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉందని, ఇద్దరం దేశ రాజకీయాల్లో మార్పు కోసం పని చేస్తే తప్పేముంది.
అంటూ ఇటీవల చెప్పుకొచ్చారు.బంగారు భారత్‌ను నిర్మిస్తామంటూనే పీకే విషయంలో తన వైఖరి వెల్లడించారు.
అయితే పీకే కూడా తెలంగాణ రాష్ట్రంలో మకాం వేసి కేసీఆర్ పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను సేకరించి నివేదికలు అందజేశారు.ఇదంతా బాగానే ఉన్నా.సోషల్ మీడియాలో మాత్రం గుసగుసలు వస్తున్నాయి.అదేమిటంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పీకే గుడ్‌బై చెప్పనున్నారట.
ఇక ఢిల్లీకి తన మకాంను మారుస్తున్నారని అక్కడి నుంచి గుజరాత్‌కు షిఫ్ట్ అయ్యేందుకు చూస్తున్నారనే చర్చ సాగుతోంది.ఏడెనిమిదేండ్లుగా కేసీఆర్‌తో ఉన్న స్నేహబంధాన్ని తెగదెంపులు చేసుకుంటారని టాక్.
ఎందుకంటే గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి పని చేసేందుకు పీకే ఎదురు చూస్తున్నారట.దీంతోనే ఆయన కేసీఆర్‌కు గుడ్‌బై చెప్పనున్నారని తెలుస్తోంది.

అయితే ప్రధాని మోడీ ఇలాక అయిన గుజరాత్‌లో తన సత్తా చాటుకునేందుకు కాంగ్రెస్ తరపున పనిచేయాలని పీకే భావిస్తున్నారట.ఇటీవల రాహుల్‌గాంధీతో పీకే భేటీ కూడా అయ్యారని సమాచారం.దీంతోనే రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయని సమాచారం.మొత్తంగా చర్చల అనంతరం పీకే కాంగ్రెస్ గూటికి చేరుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదిలా ఉండగా మరో కొత్త చర్చ తెరమీదకొస్తోంది.తెలంగాణలో టీఆర్ఎస్‌కు పని చేస్తూనే ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఎలా పనిచేస్తారనే దానిపై వాదనలు వస్తున్నాయి.
కాగా పీకే మాత్రం కాంగ్రెస్‌కే జై కొడుతున్నారని టాక్.మరి ఇటీవల కేసీఆర్ పీకేమీదనే ఆధారపడ్డారు.
ఈ క్రమంలో పీకే పై వస్తున్న గుసగుసలు నిజమైతే కేసీఆర్‌కు ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.