పిఠాపురం తెలుగుదేశం నేత వర్మ సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీలో మే 13వ తారీకు ఎన్నికల ముగిసాయి.ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తది అన్నదానిపై ఎంత ఉత్కంఠత నెలకొందో అదే విధంగా పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అన్నదానిపై కూడా టెన్షన్ గా మారింది.

కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది.2019 ఎన్నికలలో రెండు చోట్ల ఓడిపోవడంతో పిఠాపురం గెలుపు విషయంలో పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేయడం జరిగింది.పిఠాపురం( Pithapuram )లో పవన్ గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఎంతో కష్టపడ్డారు.

మొదట్లో టికెట్ కేటాయింపు విషయంలో.అలిగిన గాని చంద్రబాబు మాట్లాడటంతో వర్మ ఎన్నికలలో పవన్ గెలుపు కోసం పనిచేయడం జరిగింది.

Pithapuram Telugu Desam Leader Verma Sensational Comments Pithapuram, Pawan Kaly

ఈ క్రమంలో తాజాగా మీడియాతో వర్మ( Varma ) మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.పిఠాపురంలో పోలింగ్ శాతం పెరగడం అధికార పార్టీకి మింగుడు పడటం లేదని అన్నారు.దీంతో పవన్ కళ్యాణ్ ని ఓడించేందుకు భారీ ఎత్తున అధికార పార్టీ కుట్రలు చేస్తుందని విమర్శించారు.

పిఠాపురం, కాకినాడ జేఎన్టీయూ ప్రాంతాలలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఆ విషయాన్ని ధ్రువీకరించిందని పేర్కొన్నారు.దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రత కల్పించాలని వర్మ ఎస్పీ సతీష్ కుమార్ ని కోరడం జరిగింది.

Advertisement
Pithapuram Telugu Desam Leader Verma Sensational Comments Pithapuram, Pawan Kaly

నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేశారు.అందువల్లే భారీ ఎత్తున నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెరిగింది.దీంతో వైసీపీ ఓడిపోతే పెద్ద ఎత్తున అల్లర్లుకు పాల్పడే అవకాశం ఉందని తెలుగుదేశం నేత వర్మ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఒకే ఒక్కమాటతో చిరు, నాగ్, వెంకీ మల్టీస్టారర్ మూవీ క్యాన్సిల్ అయ్యిందట.. !
Advertisement

తాజా వార్తలు