అకిరా నందన్ ఫొటోకి స్టార్ హీరోల రేంజ్ లో పూల దండలు.. పవర్ స్టార్ కొడుకంటే మామూలు విషయమా?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో మెగా ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే.

ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.

చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పలువురు హీరోలు మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ ను ఏలుతున్న విషయం తెలిసిందే.అయితే కేవలం వీరు మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీకి వారసులు కూడా రాబోతున్నారు.

వారిలో ఒకరైన పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ కూడా ఒకరు.అయితే పవన్ కళ్యాణ్ కొడుకు సినిమాలోకి ఇప్పుడే ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ నుంచి రేణు దేశాయ్ విడిపోయి ఒంటరిగానే జీవనం సాగిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఆమె తన పిల్లలతో కలిసి దూరంగా ఉన్నప్పటికీ మెగా ఫ్యాన్స్ లో మాత్రం ఎప్పుడూ అకిరా నందన్ కు సంబంధించిన ఏదో ఒక వార్త మెగా ఫ్యాన్స్ లో వినిపిస్తూనే ఉంటుంది.

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా ఆచార్య సినిమా రిలీజ్ సందర్భంలో లేకపోతే ఏదైనా కార్యక్రమమో తెలియదు కానీ అఖిరా నందన్ ఫోటో కి భారీగా పూలదండలు పడ్డాయి.ఆ స్థాయిలో పూలదండలు కేవలం స్టార్ హీరోలకు మాత్రమే పడతాయి.

అలాంటిది ఇంకా హీరోగా ఒక్క సినిమా కూడా చేయకుండానే ఇలా కటౌట్ దండలు వేయించుకున్నాడు అంటే అకీరానందన్ భవిష్యత్తులో తప్పకుండా స్టార్ హీరో అవ్వడం ఖాయం అని అనిపిస్తోంది.పవన్ కళ్యాన్ ఇప్పటికే అకీరా ఆసక్తి మేరకు డాన్స్ లు మరియు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇప్పిస్తున్నాడు.అందుకు సంబంధించిన వీడియో లు మరియు ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చిన విషయం తెల్సిందే.

ఇకపోతే ప్రస్తుతం అకీరా వయసు 18 ఏళ్లు కాగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు