ఏ ఫోన్ కొనుగోలు చేసినా.ఫోన్ తో పాటు ఛార్జర్, ఇయర్ ఫోన్స్ వస్తూ ఉంటాయి.
ఈ మధ్య కొన్ని ఫోన్ స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇయర్ ఫోన్స్ ఇవ్వడం లేదు.ఫోన్, ఛార్జర్ మాత్రమే ఇస్తున్నాయి.
అయితే ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీ సంస్థ షియోమీ ఛార్జర్ లేకుండా స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.తాజాగా రెడ్ మీ నోట్ 11 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ ను షియోమీ విడుదల చేసింది.
ఇందులో ఛార్జర్ లేకపపోవడం విశేషం.ఈ మేరకు షియోమీ ఇండియా అధికారిక వెబ్ సైట్ లో ఈ విషయానని తెలిపారు.
నోట్ ఎస్ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ఫోన్ తో పాటు యూఎస్ బీ-సీ కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూల్, ప్రొటెక్టివ్ కేస్, క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీకార్డు ఉన్నాయి.
అయితే ఛార్జర్ లేకుండా ఫోన్ ను విడుదల చేయడం షియోమో కంపెనీ ఒక్కటే కాదు.
గతంలో యాపిల్, గూగుల్, శాంసంగ్ కంపెనీలు కూడా ఛార్జర్ లేకుండా ఫోన్ ను విడుదల చేశాయి.తాజాగా రెడ్ మీ కూడా ఆ కంపెనీల బాటలో నడించింది.ఈ ఫోన్ ను షియోమీ ఆగస్టు 31 నుంచి ఆఫ్ లైన్, ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది.6జీబీ+64జీబీ వేరియంట్ స్టోరేజ్ ధర రూ.13,499గా ఉంది.
ఛార్జర్ లేకపోడంతోనే ఈ ఫోన్ ను ఎవరూ కొనుగోలు చేయకపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇండియా చాలామంది దగ్గర రెడ్ మీ ఛార్జర్ ఉండొచ్చని షియోమీ భావిస్తుంది.అందువల్లనే ఛార్జర్ లేకుండా ఫోన్ ను విడుదల చేసిందని చెబుతున్నారు.రెడ్ మీ నోట్ 10స్ రీ బ్రాండెండ్ వెర్షన్ గా ీఈ ఫోన్ ను ఇండియాలో విడుదల ేసింది.







