ప్రస్తుత కాలంలో ఏ ఇంటర్వ్యూకు వెళ్లాలన్నా డిగ్రీ( Degree ) కచ్చితంగా ఉండాలనే సంగతి తెలిసిందే.ఎక్కువ మాస్టర్ డిగ్రీలు ఉండి, పీహెచ్డీ( Ph.
D ) చేసిన వాళ్లకు సులభంగా ఉద్యోగం లభించే అవకాశాలు అయితే ఉంటాయి.ఉన్నత చదువులు చదివినా స్థాయికి తగ్గ ఉద్యోగాలు రాకపోవడంతో కొంతమంది ఇబ్బందులు పడుతుంటారు.
అలా ఇబ్బందులు పడుతున్న వాళ్లలో డాక్టర్ సందీప్ సింగ్( Doctor Sandeep Singh ) ఒకరు కావడం గమనార్హం.
పంజాబ్ లోని( Punjab ) పాటియాలాకు చెందిన డాక్టర్ సందీప్ సింగ్ వయస్సు 39 సంవత్సరాలు కాగా నాలుగు మాస్టర్ డిగ్రీలు చేసిన సందీప్ గత 11 సంవత్సరాలుగా పంజాబ్ యూనివర్సిటీ న్యాయ విభాగంలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్ గా( Contract Professor ) పని చేశారు.
అక్కడ ఇచ్చే అరకొర జీతం సరిపోకపోవడం వల్ల ఇబ్బందులు పడిన సందీప్ సింగ్ బతుకుదెరువు కోసం కూరగాయలు అమ్మారు.సమయానికి జీతం రాకపోవడం, వచ్చిన జీతం సరిపోక బ్రతుకు కష్టంగా మారడంతో కూరగాయలు అమ్ముతున్నానని సందీప్ సింగ్ పేర్కొన్నారు.

పీహెచ్డీ సబ్జీవాలా( Ph.D Sabzi Wala ) అనే బోర్డ్ పెట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ కూరగాయలు అమ్ముతున్న సందీప్ సింగ్ కూరగాయలు అమ్మడం( Selling Vegetables ) ద్వారా ప్రొఫెసర్ గా సంపాదించిన దాని కంటే ఎక్కువ సంపాదిస్తున్నానని వెల్లడించారు.తాను ప్రొఫెసర్ వృత్తికి బ్రేక్ ఇచ్చినా ప్రొఫెసర్ వృత్తిని మాత్రం వదలనని అన్నారు.డబ్బులను పొదుపు చేసి సొంతంగా ట్యూషన్ సెంటర్ ను మొదలుపెట్టాలని నా కోరిక అని సందీప్ సింగ్ కామెంట్లు చేశారు.

సందీప్ సింగ్ కు( Sandeep Singh ) కెరీర్ పరంగా మేలు జరగాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సందీప్ సింగ్ టాలెంట్ కు తగిన గుర్తింపు దక్కాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.దేశంలో సంవత్సరం సంవత్సరానికి నిరుద్యోగం పెరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.నిరుద్యోగం తగ్గించే దిశగా అడుగులు పడాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.