పంటలకు ఆశించే వివిధ రకాల తెగుళ్ళను( Pests ) నివారించేందుకు రైతులు రకరకాల రసాయన పిచికారి మందులను ఉపయోగిస్తూ వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు.కానీ పూర్తిస్థాయిలో తెగులను అరికట్టలేకపోతున్నారు.
రసాయన పిచికారి మందుల వల్ల రైతులకు( Farmers ) పెట్టుబడి భారం విపరీతంగా పెరుగుతుంది.
వ్యవసాయ క్షేత్ర నిపుణుల సూచనల ప్రకారం అతి తక్కువ ఖర్చుతో రైతే స్వయంగా తయారు చేసుకునే ట్రైకోడెర్మావిరిడి( Trichodermaviride ) వల్ల వివిధ రకాల తెగుళ్లు పంటను ఆశించకుండా పంటను సంరక్షించుకోవచ్చు అని చెబుతున్నారు.
కూరగాయ పంటలు, పప్పు ధాన్యాల పంటలు, పత్తి, అరటి, నిమ్మ, మిరప లాంటి పంటలకు వేరు కుళ్ళు, కాండం కుళ్ళు, ఎండు తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.వీటి నివారణ కోసం రసాయన పిచికారి మందులను ఉపయోగిస్తే.
సాగు ఖర్చులో సగం ఖర్చు రసాయన ఎరువులకే పెట్టాల్సి వస్తుంది.

రైతులు శిలీంద్రపు తెగుళ్లను సమర్థవంతంగా అరికట్టే ట్రైకోడెర్మావిరిడిని నేలలో వేయాలి.100 కిలోల పశువుల ఎరువు కు( Livestock Manure ) రెండు కిలోల ట్రైకోడెర్మావిరిడి కలిపి, ఒక వారం రోజులు పక్కన పెడితే మంచి సేంద్రియ ఎరువు తయారవుతుంది.ఈ ఎరువును పంట పొలాల్లో ఉపయోగించడం వల్ల మొక్క వేరు చుట్టూ ఈ ఎరువు ఒక రక్షక కవచంలా ఏర్పడుతుంది.

ట్రైకోడెర్మా విరిడి అనేది ఒక బూజు జాతికి చెందిన శ్రీలింద్ర నాశిని.పంటలకు హాని కలిగించే శిలీంద్రాలను ఇది పూర్తిస్థాయిలో నిర్మూలిస్తుంది.ఈ ట్రైకోడెర్మావిరిడిని, పశువుల ఎరువుతో కలిపి భూమిలో తేమ( Moisture ) ఉన్నప్పుడు ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నడం వల్ల నేలలో ఉండే శిలీంద్రాల అవశేషాలన్నీ నాశనం అవుతాయి.
ఈ రైతులు ఏ పంటను సాగు చేసినా తెగుళ్లు ఆశించిన తర్వాత పంటను సంరక్షించే పద్ధతులు చేపట్టడం కంటే.
పంటకు ఎలాంటి తెగుళ్లు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణుల అభిప్రాయం.