కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) కు కోలీవుడ్ లో మాత్రమే కాదు మన తెలుగులో కూడా బాగానే ఫాలోయింగ్ ఉంది.అందుకే ఈయన సినిమాలు మన దగ్గర కూడా భారీ స్థాయిలోనే రిలీజ్ చేస్తుంటారు.
మంచి టాక్ వస్తే ఇక్కడ కూడా బాగానే కలెక్షన్స్ రాబడతారు.ఈ ఏడాది వారిసు సినిమాతో విజయం సాధించిన విజయ్ మరో సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.
సంక్రాంతి సీజన్ ను కబ్జా చేసిన విజయ్ ఈసారి దసరా బరిలో కూడా నిలవబోతున్నాడు.దళపతి విజయ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ( Lokesh Kanagaraj )దర్శకత్వంలో ‘లియో’ సినిమా చేస్తున్నాడు.
భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటిగా తెరకెక్కుతుంది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియెన్స్ ను అలరించి అంచనాలు అమాంతం పెంచేసింది.
ప్రస్తుతం లాస్ట్ పార్ట్ షూట్ కంప్లీట్ చేస్తూనే రిలీజ్ కు భారీ ప్రణాళికలు వేసుకుంటున్నారు.తాజాగా ఈ సినిమా రన్ టైం గురించి అదిరిపోయే వార్త నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమా రన్ టైం ను మేకర్స్ ఫిక్స్ చేసినట్టు టాక్.ఇప్పటి వరకు లోకేష్ తెరకెక్కించిన అన్ని సినిమాలకు దాదాపు 3 గంటల పాటు నిడివి ఉండేది.కానీ ఈసారి లియో సినిమాకు ఎవ్వరూ ఊహించని నిడివిని లాక్ చేసారు…
ఫైనల్ గా లియో సినిమా( LEO Movie )కు రన్ టైం 2 గంటల 39 నిముషాల రన్ టైం ను లాక్ చేసినట్టు టాక్.లోకేష్ తెరకెక్కించిన సినిమాల్లో ఇంత తక్కువ రన్ టైం లియో సినిమానే కావడం విశేషం.కాగా సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష( Trisha ) హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారు.