ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమా మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.జగన్ ను ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా వద్దనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
వద్దనుకోవడం వలనే నేతలు వైసీపీకి రాజీనామాలు చేస్తున్నారని దేవినేని ఉమా అన్నారు.గతంలో జగన్ అడిగిన ఒక్క ఛాన్స్ ఆఖరి ఛాన్స్ అయిందని విమర్శించారు.
నాలుగున్నరేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.అయితే వచ్చే ఎన్నికల్లో జగన్ అవినీతి పాలనకు ప్రజలే తగిన బుద్ది చెప్తారని తెలిపారు.
ఈ క్రమంలో మళ్లీ టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.