దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నేడు కీలక మూడవ టీ20 మ్యాచ్ జరుగనుంది.ఈ మ్యాచ్లో గెలిచి భారత్ సిరీస్ సమం చేయాలని భావిస్తోంది.
మరోవైపు దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.

ఈ టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడం.రెండవ మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించిన సంగతి తెలిసిందే.భారత జట్టు బ్యాటింగ్ పరంగా కాస్త పర్వాలేదు కానీ బౌలింగ్లో మెరుగ్గా రాణించలేకపోవడం వల్లనే రెండవ టీ20 మ్యాచ్ లో ఓటమిని చవిచూడడం స్పష్టంగా కనిపించింది.
భారత బౌలర్లు పోటీపడి మరి భారీ పరుగులు సమర్పించుకున్నారు.ఇక మూడవ టీ20 మ్యాచ్ లో భారత్ గెలుపు, ఓటమి బౌలింగ్ పైనే ఆధారపడి ఉంది.జట్టులో పేసర్లైన ఆర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్ గాడిన పడకపోతే భారత బ్యాటర్లు ఎన్ని పరుగులు చేసినా కూడా విజయం సాధించడం కష్టం అయ్యే అవకాశం ఉంది.

ఇటీవలే జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో ఆర్షదీప్ సింగ్( Arshdeep singh ) చివరి అయిదవ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు.కానీ మిగతా నాలుగు మ్యాచ్లలో రాణించలేకపోయాడు.కాబట్టి నేడు జరిగే మ్యాచ్లో అర్షదీప్ సింగ్ రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది.టీ20 ప్రపంచ కప్ కు ముందు భారత జట్టు కేవలం నాలుగు టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడనుంది.ఈ మ్యాచులలో అద్భుతంగా రాణిస్తేనే సెలక్టర్ల దృష్టిలో పడి, ప్రపంచ కప్ ఆడే భారత జట్టులో చోటు దక్కుతుంది.
భారత జట్టు ఓపెనర్లైన శుబ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్( Shubman Gill, Yashasvi Jaiswal ) రెండవ మ్యాచ్లో డక్ అవుట్ అయ్యారు.ఈ మ్యాచ్ లో వీళ్లు రాణించడం, వీరితోపాటు సూర్య కుమార్ యాదవ్, రింకూ సింగ్ రాణిస్తే.
భారత్ ఈ సిరీస్ కచ్చితంగా సమం చేసే అవకాశం ఉంది.