హైదరాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా( Amit Shah ) పర్యటన పర్యటిస్తున్నారు.ఈ మేరకు ఇంపీరియల్ గార్డెన్ లో బీజేపీ పార్టీ( BJP party ) సోషల్ మీడియా వారియర్స్ తో అమిత్ షా భేటీ అయ్యారు.
సోషల్ మీడియాలో ప్రతి కార్యకర్త యాక్టివ్ గా ఉండాలని సూచించారు.అన్ని వర్గాల ప్రజలు మోదీకి జై కొడుతున్నారని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లోనూ మనదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే మోదీ సందేశాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని అమిత్ షా పేర్కొన్నారు.
దేశంలో ఏ మూలకు వెళ్లినా మోదీ నినాదమే వినిపిస్తోందన్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్( Congress, BRS ) లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించిన అమిత్ షా అవినీతి లేకుండా మోదీ పాలన అందిస్తున్నారని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే అతి త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయని, దేశ ప్రజలంతా మరోసారి మోదీని ప్రధానిగా ఎన్నుకోబోతున్నారని వెల్లడించారు.మోదీ మళ్లీ ప్రధాని అయితే భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిపారు.







