భారత దేశంలో రోజు రోజుకు న్యాయ వ్యవస్థ లో పెండింగ్ కేసుల సంఖ్య గణీయంగానే పెరుగుతూ పోతుంది.ప్రజలు వారికి వచ్చే న్యాయ సమస్యలు తీర్చే కోర్టు లలో ఇలా ఏళ్ల తరబడి కేసులు నమోదు అయితే, తొందర తీర్పు రాకుంటే దేశ ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ప్రస్తుతం ఉన్న పరిస్థితులు గమనిస్తే, దేశం లో సుమారు పెండింగ్ కేసుల సంఖ్య ఆగస్టు 2 2022 నాటికి దాదాపు కేసుల సంఖ్య 5 కోట్లకు దగ్గరగా అంటే 4.7 కోట్లు ఉన్నాయి.ఇంకా గత పదేళ్లలో పేరుగుతు వెళ్తుంది తప్ప తగ్గే అవకాశం లేదు.అదేవిధంగా ఒక్క సుప్రీం కోర్టు లోనే దాదాపు 71000 వరకూ పెండింగ్ లో ఉన్నాయి.
దేశం లో పెద్ద కోర్టు లోనే అన్ని కేసులు పెండింగ్ లో ఉంటే మరీ క్రింది స్తాయి కోర్టు ల పరిస్థితి ఎంటి?
వివిధ రాష్ట్రాల హైకోర్టు లలో దాదాపు 42 లక్షల వరకు పెరుగుతూ పోతున్నాయి.
అదే జిల్లా కోర్ట్ లలో సభార్డినెట్ కోర్టు లలో 2.7 కొట్ల మెర ఉన్నాయి.జిల్లా స్థాయిల్లో ఇంతా జాప్యం ఏర్పడుతుంది, అటు లా కమిషన్ కూడా చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
దీనికి ప్రధాన కారణం దేశ కోర్ట్ లలో న్యాయ మూర్తుల కొరత, ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ బలోపేతం కోసం కృషి చేయకపోవటం, అటు బడ్జెట్ సైతం కేటాయించకపోవడం కారణాలు గా చెప్పవచ్చు.ప్రస్తుతం ఉన్న జడ్జిలు 21000 మాత్రమే, అంటే ప్రతి 10 మంది న్యాయ మూర్తులకు దాదాపు 1మిలియన్ కేసుల అనమటా, గతం లో లా కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది.కనీసం 50 మంది న్యాయ మూర్తులకు ఒక మిలియన్ కేసులు ఉండే విధంగా, కొంత మేర ఉపశమనం కలిగిస్తుంది అని, అటు బడ్జెట్ కూడా 0.1 నుండి 0.4 శాతం కేటాయిస్తే, ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది.

ప్రస్తుతం ఉన్న లిటిగేషన్ లు చూస్తే ఇవి పరిష్కారాలు కావడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో మనకి తెలియదు.ఇటీవల కాలంలో నియమితులైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్ర చూడ్ సుప్రీం కోర్టులో ప్రస్తుతం వివాహాల వివాదాలకు సంబందించి ముడు వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి.చాలా మంది పిటిషనర్ లు వీటిని తమకు నచ్చిన ప్రదేశానికి బదిలీ చేయాలని కోరుతున్నారని ప్రతి బెంచ్ రోజు 10 బదిలీ పిటిషన్లు స్వీకరించి 13 బెంచ్ ల ముందుకు రోజు 130 కేసులు విచారణకు వస్తాయి.అలా వారానికి 650 కేసులు పరిష్కరించగలవు అని అన్నారు.
ఇలా అన్ని కేసులలో వేగాన్ని పెంచి అన్ని హై కోర్టు లలో,సుబార్డినట్ కోర్టు లో స్పీడి దిస్పోజ్ చేసే విధానం అమలు చేస్తే పెండింగ్ కేసుల సంఖ్య ను తగ్గించే అవకాశం ఉంటుంది.

అదేవిధంగా గ్రామీణ స్థాయి లలో గ్రామ న్యాయలాయలు, పెట్టీ ఎక్కడ సమస్య మొదలు అయితే అక్కడే పరిష్కారం ఉండే విధంగా చేస్తే బాగుంటుంది.దేశంలో మధ్యవర్తిత్వం ఆర్బిట్రేషన్ వంటి కార్యక్రమాలు చేపట్టి కేసులు తగ్గించే విధంగా చూడాలి.ఏళ్ల తరబడి కేసులు కొట్టులో ఉంటే ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద అసహనం ఏర్పడుతుంది.
ప్రభుత్వాలు అటు జ్యుడీషియల్ వ్యవస్థను బలోపేతం చేసి, న్యాయవ్యవస్థకు బడ్జెట్ను పెంచి, దేశంలో ఇంకా జడ్జిలను వివిధ కోర్టులో నియమించి, కావలసిన ప్రాంతాల్లో కోర్టులను పెట్టి ఉన్నపలంగా కేసులను పరిష్కరించే విధంగా చూస్తే బాగుంటుంది.