బీసీసీఐకు షాకిచ్చిన పేటీఎం.. స్పాన్సర్షిప్ రద్దుకు ప్రతిపాదన

ప్రపంచ క్రికెట్ లో అత్యంత విలువగల, ఎక్కువ ఆదాయం కలిగిన సంస్థ భారత్ కు చెందిన బీసీసీఐ. ప్రపంచ క్రికెట్ నే బీసీసీఐ శాసిస్తుంది.బీసీసీఐకు ఎవరూ అడ్డు చెప్పరు.బీసీసీఐ నిర్ణయాలను ఐసీసీఐ కూడా వెంటనే ఆమోదిస్తూ ఉంటుంది.బీసీసీఐ చెప్పిందే వేదం అన్నట్లుగా ప్రపంచ క్రికెట్ లో ఆ సంస్థ ఆధిపత్యం కొనసాగుతోంది.బీసీసీఐ ఏదైనా అనుకుంటే ఆ పని జరగాల్సిందే.

 Paytm Shocked Bcci With Proposal To Cancel Sponsorship Details, Bcci, Paytm, Spo-TeluguStop.com

మ్యాచ్ ల షెడ్యూల్స్, ఏవైనా మ్యాచ్ నిర్వహణ.ఇలా ఏదైనా సరే బీసీసీఐ చెప్పినట్లే జరుగుతుంది.

అయితే బీసీసీఐకి తాజాగా స్పాన్సర్ల నుంచి చిక్కులు ఎదురవుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ లీగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ లీగ్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.ప్రపంచంలో నిర్వహించే క్రికెట్ లీగ్ లో అత్యంత ఖరీదైన లీగ్ కూడా ఐపీఎల్ నే.అందుకే ఐపీఎల్ లో ఆడేందుకు అన్ని దేశాల క్రికెటర్లు పోటీ పడుతూ ఉంటారు.ఇందులో ఒక్కసారి అడితే చాలు అనేంతగా దేశీయ, విదేశీ క్రికెటర్లు ఆసక్తి చూపుతూ ఉంటారు.

అయితే ఐపీఎల్ 15 ఆశించినంత సక్సెస్ కాలేదు.దంతో స్పాన్సర్ ర్షిప్ తొలగించుకోవడానికి పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి.తాజాగా పేటీఎం టైటిల్ స్పాన్సర్ షిప్ వదులుకోవడానికి సిద్ధపడింది.తమ స్పాన్సర్ షిప్ రద్దు చేయాలని బీసీసీఐను పేటీఎం కోరింది.భారత్ లో జరిగే సిరీస్ లకు టైటిల్ స్పాన్సర్ గా పేటీఎం ఉంది.2019లో రూ.326.80 కోట్లతో ఒప్పందం జరిగింది.2023 దాకా ఈ ఒప్పందం ఉంది.అయితే మరో ఏడాది ఉండగానే స్పాన్సర్ షిప్ వదులుకోవాలని పేటీఎం నిర్ణయించింది.

Telugu Bcci, Byjus, Icici, Indiacricket, Latest, Paytm, Shock, Sponser, Ups-Late

తమ డీల్ ను మాస్టర్ కార్డుకు మళ్లించాలని బీసీసీఐ ను పేటీఎం సంస్థ కోరింది.గురువారం జరగనున్న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై బీసీసీఐ అధికారులు చర్చించనున్నారు.అయితే స్పాన్సర్లు మధ్యలోనే వెళ్లిపోవడం ఇది తొలిసారి కాదు.గతంలో ఒప్పో మధ్యలోనే వెళ్లిపోయింది.ఇక 2021 ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి వివో మధ్యలోనే వెళ్లిపోవడంతో డ్రీమ్ 11కు అప్పగించారు.గత ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ ను టాటా దక్కించుకుంది.

ఇక టీమిండియా జెర్సీ స్పాన్సర్ గా బైజూస్ ప్రస్తుతం కొనసాగుతుంది.ఇక బైజూస్, బీసీసీఐ మధ్య కూడా సరిగ్గా సంబంధాలు లేవని తెలుస్తోంది.2022 జులై నాటికి బీసీసీఐకి బైజూస్ రూ.86.21 కోట్లు బాకీ ఉంది.వీటిని బైజూస్ చెల్లించడం లేదని సమాచారం.

దీంతో గురువారం జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై కూడా చర్చించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube