5డబ్యూఎస్ తో యాక్షన్ పెర్ఫార్మెన్స్ చూపిస్తా అంటున్న పాయల్! ఫస్ట్ లుక్ రిలీజ్

ఇప్పటి వరకు బోల్డ్ హాట్ బ్యూటీగానే గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మొదటిసారి ఓ లేడీ ఒరియాంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

మొదటి సినిమాతో తన బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన ఈ భామ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా యాక్షన్ సీక్వెన్స్ తో ఇరగదీస్తా అంటూ ప్రనదీప్ దర్శకత్వంలో కొత్త సినిమాతో రాబోతుంది.

ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది.ఇక ఈ సినిమాకి 5డబ్యూఎస్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు.

Payal Rajput New Movie First Look Title Release-5డబ్యూఎస్ త�

ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఏమిటి అనే ఎలిమెంట్స్ ని ఈ టైటిల్ తో దర్శకుడు ప్రనదీప్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా పాయల్ రాజ్ పుత్ సినిమా విశేషాలని పంచుకుంది.

నా కెరియర్‌కి కంప్లీట్‌గా ఇది కొత్త సినిమా పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయడం అనేది నా కల.అయితే ఈ అవకాశం టాలీవుడ్ లో ఐదు సినిమాలతోనే వస్తుందని అనుకోలేదు.ఈ పాత్ర కోసం విజయశాంతి చేసిన సినిమాలు స్ఫూర్తిగా తీసుకొని ఆమెలా నటించడానికి ప్రయత్నం చేశా.

Advertisement

ఆమెని స్పూర్తిగా తీసుకొని చేసిన నా స్టైల్ లో ఉంటుంది.ఇది సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతుంది.కచ్చితంగా ఈ సినిమాతో తనకు ఇప్పటి వరకు ఉన్న గుర్తింపు మారిపోతుందని అనుకుంటున్న అని చెప్పింది.

మొత్తానికి పాయల్ పాప కొత్త సినిమా ఫస్ట్ లుక్ అంత ఇంప్రెసివ్ గా లేకపోయినా కథలో ఏదో ఉందని మాత్రం టైటిల్ తో అర్ధమవుతుంది.మరి ఈ సినిమాతో ఈ బోల్డ్ బ్యూటీ ఇమేజ్ ఎంత వరకు మారుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు