పవన్ చూపు ఉత్తరాంధ్ర వైపు ? తిరుపతి పై వారి ఒత్తిడి ?

2024 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ముందుగానే అన్ని పార్టీలు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి.అప్పుడే ఎన్నికల ప్రచారం సైతం నిర్వహిస్తున్నాయి.

గడప గడపకు ప్రభుత్వం పేరుతో వైసిపి, బాదుడే బాదుడు పేరుతో టీడీపీ , రైతు పరామర్శలు, ప్రభుత్వ వ్యతిరేక సభలు సమావేశాలపై జనసేన పార్టీ ఇలా ఎవరికి వారు జనాల్లో మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం పై అప్పుడే ఆసక్తి మొదలయింది.2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓటమి చెందడంతో, ఈసారి ఎన్నికల్లో ఆ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు.అయితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏదో ఒక అనుకూలమైన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ప్లాన్ లో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా సంకేతాలు వెలుబడ్డాయి.

దీనికి తగ్గట్లుగానే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఉత్తరాంధ్ర పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.ఇదిలా ఉంటే తిరుపతి నుంచి పవన్ పోటీ చేయాలని, ఇక్కడ పోటీ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారని, గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచిన సందర్భాన్ని జనసైనికులు వివరిస్తున్నారు.

అదీ కాకుండా జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేయాలనే ఒత్తిడి పెంచుతున్నారు.ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా పవన్ పైన ఒత్తిడి పెంచుతున్నారు.

Advertisement

తిరుపతిలో జనసేన కు సంబంధించిన అన్ని రాజకీయ వ్యవహారాలను చూసుకునే కిరణ్ రాయల్ సైతం పవన్ తిరుపతి నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ తిరుపతి నుంచి పోటీ చేయాలనే విషయంపై ఒత్తిడి పెంచుతున్నారు.

కాపు సామాజిక వర్గం ఓట్లు తిరుపతిలో ఎక్కువగా ఉండడం , చిరు, పవన్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండడంతో ఆ రకమైన ఒత్తిడిని పవన్ ఎదుర్కొంటున్నారు.ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు మొగ్గు చూపాలా లేక తిరుపతిలోనే పోటీ చేయాలా అనే దానిపై పవన్ ఆలోచనలో పడ్డారట.పవన్ ఏ నియోజకవర్గమైన ఈసారి ముందుగానే నిరణయించుకుని.

అక్కడి పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చుకుని విజయం సాధించే దిశగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఓ వైపు కలెక్టరేట్ లో కీలక సమావేశం.. మరోవైపు ఫోన్లో రమ్మీ ఆడుతున్న అధికారి
Advertisement

తాజా వార్తలు