జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ ప్రయాణం మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.విశాఖ నుంచి సాయంత్రం 4 గంటలకు బెజవాడకు వెళ్లనున్నారు పవన్.
రేపు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరించదన్ ను కలిసేందుకు ఆయన అనుమతి కోరినట్లు సమాచారం.గవర్నర్ ను కలిసేందుకు విజయవాడకు వెళ్లనున్న పవన్ రేపు మంగళగిరి పార్టీ కార్యాలయంలో శ్రేణులకు అందుబాటులో ఉండనున్నారు.
మరోవైపు విశాఖ విమానాశ్రయం పోలీసుల అదుపులో ఉంది.పవన్ రాకపై పూర్తి సమాచారం తమ దగ్గర లేదని పోలీసులు, ఎయిర్ పోర్టు అధికారులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే పవన్ తో పాటు మరో వాహనాన్ని మాత్రమే అనుమతినిస్తాని అధికారులు తెలిపారు.







