వచ్చే ఎన్నికల్లో తన పార్టీకి పెద్ద మెుత్తంలో ప్రజల మద్దతు పొందాలని, ఘననీయమైన ఓటు బ్యాంకును సాధించాలనే ఉద్దేశంలో జనసేన పవన్ కళ్యాణ్ ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నారు.అలాగే రాజకీయంలో డబ్బు ప్రాధన్యతను గుర్తించిన పవన్.
నిధుల సమీకరణపై దృష్టి పెట్టారు.సాధరంణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బు పంచి వారి ఓట్లను పొందాలని చూస్తుంటాయి, అయితే ఎన్నికల సమయంలో కాకుండా, కష్టాల్లో ఉన్న సమయంలో బాధితులకు డబ్బు చెల్లించి వారి గుండెల్లోకి నిలవవచ్చని పవన్ కళ్యాణ్ భావించినట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో తన పార్టీకి పెద్ద మెుత్తంలో ప్రజల మద్దతు పొందాలని, ఘననీయమైన ఓటు బ్యాంకును సాధించాలనే ఉద్దేశంలో జనసేన పవన్ కళ్యాణ్ ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నారు.
అలాగే రాజకీయంలో డబ్బు ప్రాధన్యతను గుర్తించిన పవన్.
నిధుల సమీకరణపై దృష్టి పెట్టారు.సాధరంణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బు పంచి వారి ఓట్లను పొందాలని చూస్తుంటాయి, అయితే ఎన్నికల సమయంలో కాకుండా, కష్టాల్లో ఉన్న సమయంలో బాధితులకు డబ్బు చెల్లించి వారి గుండెల్లోకి నిలవవచ్చని పవన్ కళ్యాణ్ భావించినట్లు తెలుస్తోంది.
గత మూడేళ్ళ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను సాయం అందిస్తున్న జనసేన పార్టీ అధినేత మరింత మంది భాదితులకు సాయాన్ని విస్తరించాలని చూస్తున్నారు.ప్రస్తుతం ఆత్యహాత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున పంపిణీ చేశారు.ఇప్పటివరకు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో 500 మంది రైతుల కుటుంబాలకు సాయం చేశారు.
ఈ కార్యక్రమానికి దాదాపు 5 కోట్లు ఖర్చు పెట్టారు.

వైఎస్సార్‌సీపీ హయాంలో దాదాపు 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. దాదాపు 30 కోట్ల రూపాయల వరకు వారి కుటుంబాలకు సాయం అందించనున్నట్లు మరోహర్ వెల్లడించారు.గుంటూరు జిల్లా ఇప్పతం గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా జగన్ ప్రభుత్వం ఇళ్లు కూల్చివేసిందని ఆరోపిస్తూ వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున మంగళవారం జనసేన పార్టీ అధినేత ప్రకటించారు.
మొన్న గ్రామంలో పెద్దఎత్తున ప్రదర్శన చేసి బాధిత కుటుంబాలకు పవన్ అండగా నిలిచారు.ఆపద సమయంలో వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.