దేనికీ గర్జన అంటూ పవన్ మరోసారి ట్వీట్

ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ట్వీట్ చేశారు.దేనికి గర్జన అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

ఆసుపత్రిలో మృతి చెందిన వారిని తరలించేందుకు వాహనం కూడా సమకూర్చలేనందుకా అని నిలదీశారు.లేక కన్నుమూసిన బిడ్డను భుజాన వేసుకొని బైక్ పై తీసుకెళ్లేలా చేసినందుకా.? అని మండిపడ్డారు.అంబులెన్స్ మాఫియాను పెంచి పోషిస్తున్నందుకా అని ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు.

జెండా ఊపి ప్రారంభించిన అంబులెన్స్ లు ఏమయ్యాయి అని ప్రశ్నించారు.అయితే గత కొన్ని రోజులుగా ఏపీ మంత్రులకు, జనసేనాని మధ్య ట్విట్టర్ వేదికగా వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు