చీకటిలోనే పవన్ కళ్యాణ్ ర్యాలీ..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో మూడు రోజులపాటు పర్యటించనున్న సంగతి తెలిసిందే.జనవాని కార్యక్రమం పేరిట ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి విశాఖకి ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ చేరుకోవడం జరిగింది.

 Pawan Kalyan's Rally In The Dark In Vishakapatnam , Pawan Kalyan, Janasena, Vish-TeluguStop.com

ఇక ఇదే సమయంలో విశాఖలో “విశాఖ గర్జన” కార్యక్రమం జరగటంతో విశాఖపట్నం విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.పవన్ కోసం విమానాశ్రయం వద్ద వేచి ఉన్న జనసైనికులు.

ఏపీ మంత్రుల కార్లపై రాళ్ల దాడి చేయడం జరిగింది.

ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.

ఇదిలా ఉంటే విశాఖకు చేరుకున్న పవన్ కళ్యాణ్ నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు.కానీ ర్యాలీ జరుగుతున్న సమయంలో స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో.

చీకటిలోనే పవన్ ర్యాలీ నిర్వహించారు.ఈ సమయంలో చుట్టుపక్కల కార్యకర్తలు సెల్ ఫోన్ లైట్ ల వేయడంతో పవన్ ఆ సెల్ ఫోన్ కాంతి లోనే ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

 దాదాపు మూడు రోజులపాటు విశాఖలో పర్యటిస్తూ ఉండటంతో.పవన్ తాజా పర్యటన ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube