వైసీపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ( YCP Minister Chelluboina Venugopala Krishna) కీలక వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ ప్రజలను నమ్ముకున్నారని చెప్పారు.
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తామని తెలిపారు.
సీఎం జగన్( CM Jagan ) ను విమర్శించేందుకే టీడీపీ – జనసేన సభ పెట్టిందని మండిపడ్డారు. టీడీపీ – జనసేన( TDP , Janasena ) అజెండా ఏంటో చెప్పలేకపోయారన్నారు.జగన్ ను అధ: పాతాళానికి తొక్కేయడానికి మీరు ఎవరని ఆయన ప్రశ్నించారు.టీడీపీ జెండా మోయడమే జనసేన పార్టీ అజెండా అన్న మంత్రి చెల్లుబోయిన కాసుల కోసం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )పార్టీని నడుపుతున్నారని ఆరోపించారు.అలాగే పులివెందులలో చంద్రబాబు గెలవడం అసాధ్యమని స్పష్టం చేశారు.