పవర్ స్టార్ తొలి ఇంస్టాగ్రామ్ పోస్ట్.. ఎమోషనల్ తో కూడిన స్వీట్ మెమొరీస్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్( Instagram ) లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈయన స్టార్ హీరోలందరి కంటే లాస్ట్ లో ఇంస్టాగ్రామ్ అకౌంట్ తీసుకున్నారు.

 Pawan Kalyan's First Instagram Post Features His Memorable Moments, Pawan Kalyan-TeluguStop.com

ఇప్పటి వరకు ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్స్ ఉన్నాయి కానీ ఇంస్టాగ్రామ్ లేదు.అయితే తాజాగా పవన్ ఇంస్టాగ్రామ్( Pawan kalyan ) లోకి కూడా అడుగు పెట్టాడు.

ఎటువంటి పోస్ట్ కానీ హంగామా కానీ లేకుండానే పవన్ ఎంట్రీ స్టార్ట్ అయ్యింది.

చడీ చప్పుడు లేకుండా వచ్చినప్పటికి పవర్ స్టార్ అప్పుడే 2.4 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించు కున్నాడు.ఒక్క పోస్ట్ కూడా ఈ అకౌంట్ లో పెట్టక పోయిన పవన్ ను అభిమానించే వారంతా ఫాలోవర్స్ గా మారిపోయారు.

అయితే పోస్ట్ పెట్టక పోవడంతో పవన్ కళ్యాణ్ మొదటి పోస్ట్ ఏం పెడతారా అనే సందేహాలతో పాటు ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ కూడా పెరిగింది.

div class=”middlecontentimg”>

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికీ నిన్న సాయంత్రం పవన్ పోస్ట్ పెట్టి సర్ప్రైజ్ చేసాడు.మరి పవన్ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉండడంతో పవన్ దేనికి సంబంధించిన పోస్ట్ పెడతారా అని ఎదురు చూసారు.అయితే పవన్ మొదటిసారి సినీ పరిశ్రమపై తనకు ఉన్న ఇష్టం ఎంతనో మొత్తం చూపించేలా పోస్ట్ చేసారు.

div class=”middlecontentimg”>

పవన్ కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు తనకు పరిచయం ఉన్న స్టార్స్ అందరిని ఒక వీడియోలో చూపిస్తూ బ్యూటిఫుల్ మెమొరీస్ ను షేర్ చేసారు.ఈ వీడియో షేర్ చేస్తూ.చలనచిత్ర పరిశ్రమలో భాగమై ఎంతో మంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి పని చేసినందుకు కృతజ్ఞుణ్ణి.మన బంధం ఇలానే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాల్ని పంచుకోవాలని ఆశిస్తూ.

అంటూ పవర్ స్టార్ చేసిన తొలి పోస్ట్ కు భారీ రెస్పాన్స్ లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube