తమిళం లో సూపర్ హిట్ అయిన వినోదయ సిత్తం సినిమా ను తెలుగు లో పవన్ కళ్యాణ్ హీరో గా సాయి ధరమ్ తేజ్ కీలక పాత్ర లో రీమిక్స్ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.అందుకు సంబంధించిన ప్రచారం జోరుగా సాగింది, పవన్ కళ్యాణ్ 30 నుండి 35 రోజుల డేట్లు ఇస్తే చాలు అంటూ నిర్మాతలు ఆయన చుట్టూ తిరిగారని.
త్రివిక్రమ్ కూడా స్క్రిప్ట్ వర్క్ లో తన వేలు పెట్టాడు అంటూ ప్రచారం జరిగింది.ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్ర ఈ సినిమా కోసం కలం పట్టాడని.
రీమేక్ అయినప్పటికి కూడా తెలుగు సినిమా అన్నట్లుగా ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేశారు అంటూ కూడా ప్రచారం జరిగింది.
ఇప్పుడు ఇదే స్క్రిప్ట్ ను ఒక తెలుగు సినిమా సీనియర్ స్టార్ హీరో వద్దకు తీసుకు వెళ్లారు అనే వార్తలు వస్తున్నాయి.
ఆ హీరో ఇప్పటికే ఈ రీమేక్ కి ఓకే చెప్పాడని త్వరలోనే రీమేక్ పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా మాత్రమే చేస్తాడని.
ఆ తర్వాత రాజకీయాలతో బిజీ అవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యం లో ఈ రీమేక్ సీనియర్ హీరో వద్దకు వెళ్ళి పోయినట్లుగా ప్రచారం జరుగుతుంది.ఆ సీనియర్ హీరో ఎవరు అనే విషయం ఒకటి రెండు వారాల్లో ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం సినిమా కు సంబంధించిన అప్డేట్ అయితే ఏమీ లేదు.త్రివిక్రమ్ రెడీ చేసిన స్క్రిప్ట్ అవ్వడం తో ఆ సీనియర్ హీరో వెంటనే ఓకే చెప్పాడని, సాయి ధరమ్ తేజ్ నటిస్తాడా లేదంటే మరెవ్వరైనా యంగ్ హీరో ను ఆ సినిమా లో కీలక పాత్ర కోసం తీసుకుంటారనేది చూడాలి.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు.హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ కార్యక్రమాలను ఈ సంవత్సరం చివరి వరకు ముగించే అవకాశాలు ఉన్నాయి.వచ్చే సంవత్సరం సమ్మర్ లో హరి హర వీరమల్లు సినిమా రాబోతుంది.







