పవన్‌ ఫ్యాన్స్ డిమాండ్‌ తో 'వకీల్‌ సాబ్‌' రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌

పవన్‌ కళ్యాణ్‌ వకీల్ సాబ్‌ విడుదల తేదీ కోసం చాలా కాలంగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.షూటింగ్ లు పూర్తి కాని సినిమాల విడుదల తేదీలు ప్రకటిస్తున్న ఈ సమయంలో షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టిన వకీల్‌ సాబ్ విడుదల తేదీని ఎందుకు ప్రకటించడం లేదు అంటూ గత రెండు మూడు రోజులుగా పవన్‌ ఫ్యాన్స్ నిర్మాత దిల్‌ రాజును ప్రశ్నిస్తున్నారు.

 Pawan Kalyan Vakeel Saab Movie Release Date Confirm, Pawan Kalyan ,vakeel Saab M-TeluguStop.com

ఇటీవలే మేము ఏప్రిల్‌ లో రెండవ వారంలో సినిమా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఒక కథనంలో పేర్కొనడం జరిగింది.మాకు అందిన సమాచారం నిజం అయ్యింది.

దిల్‌ రాజు అండ్ టీమ్‌ వకీల్‌ సాబ్‌ ను ఏప్రిల్‌ 9న విడుదల చేసేందుకు అధికారికంగా ప్రకటన చేశారు.వకీల్‌ సాబ్‌ సినిమా చిత్రీకరణ కరోనా కారణంగా కాస్త ఆలస్యం అయ్యింది.

లేదంటే సరిగ్గా ఏడాది క్రితమే సినిమా విడుదల అయ్యేది.

బాలీవుడ్‌ పింక్ మూవీ కి రీమేక్ గా రూపొందిన వకీల్‌ సాబ్ సినిమా లో అంజలి మరియు నివేథా థామస్ లు నటించారు.శృతి హాసన్‌ కీలక గెస్ట్ రోల్‌ లో కనిపించబోతుంది.పింక్ మూవీ కి కాస్త కమర్షియల్‌ టచ్‌ ఇచ్చి ఈ సినిమాను వేణు శ్రీరామ్‌ తెరకెక్కించాడు.

దిల్‌ రాజు మరియు బోణీ కపూర్‌ లు నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే భారీ బిజినెస్‌ చేసినట్లుగా తెలుస్తోంది.సినిమా విడుదల సమయానికి థియేటర్లకు 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

అందుకే భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేసి రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేయాలనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు.పవన్‌ కళ్యాణ్‌ మొదటి సారి ఈ సినిమాలో లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌ లుక్ మరియు పోస్టర్‌ లు సినిమాపై అంచనాలను ఆకాశానికి పెంచాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube