ఆహాలో స్ట్రీమింగ్ కు 'వకీల్‌ సాబ్‌'.. దిల్‌ రాజు ప్లాన్‌ అదుర్స్‌

వకీల్ సాబ్‌ ఇటీవలే అమెజాన్‌ లో స్ట్రీమింగ్ అవుతుంది కదా మళ్లీ ఆహా లో ఏంటీ అంటూ ఆలోచిస్తున్నారా.

అసలు విషయం ఏంటీ అంటే ఇండియాలో మరియు ఓవర్సీస్‌ లో సినిమా రైట్స్ ను వేరు వేరుగా అమ్మేస్తూ ఉంటారు.

అంటే వకీల్‌ సాబ్‌ సినిమా ఇండియాలో మాత్రమే రైట్స్ అమ్మాయి.ఓవర్సీస్ అభిమానులు అమెజాన్ లో వకీల్‌ సాబ్‌ సినిమా ను చూసే అవకాశం లేదు.

ఆహా లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ ను మొదలు పెట్టారు.అది కూడా ఆహా లో భారీ ఎత్తున స్ట్రీమింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆహా లో స్ట్రీమింగ్‌ అవుతున్న వకీల్‌ సాబ్‌ సినిమా ను చూడాలంటే ఓవర్సీస్ వారు భారీ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.పవన్‌ కళ్యాణ్‌.

Advertisement

శృతి హాసన్‌ జంటగా దిల్‌ రాజు నిర్మించిన ఈ సినిమా కు వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించాడు.తెలుగు రాష్ట్రాలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వకీల్‌ సాబ్‌ కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల ఆగిపోయింది.

కాని వకీల్‌ సాబ్‌ వెంటనే అమెజాన్ ప్రైమ్‌ లో విడుదల చేయడం జరిగింది.భారీ ఎత్తున వ్యూస్ ను దక్కించుకున్న వకీల్‌ సాబ్‌ లో దాదాపు వారం రోజుల పాటు ట్రెండ్‌ అయ్యింది.

వకీల్‌ సాబ్‌ కు పోటీగా ఇతర సినిమా లు ఏమీ లేకపోవడం వల్ల అమెజాన్ లో భారీ వ్యూస్ ను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి ఆహా లో వకీల్‌ సాబ్‌ ను విడుదల చేసిన వెంటనే ఓవర్సీస్‌ ప్రేక్షకులు కూడా వెంటనే సినిమా ను చూసేందుకు ఆసక్తిగా చూపిస్తున్నారు.

  దిల్ రాజు వకీల్‌ సాబ్‌ ఓవర్సీస్‌ స్ట్రీమింగ్‌ రైట్స్ ను ఆహా కు ప్రత్యేకంగా అమ్మడం వల్ల భారీ మొత్తం లో డబ్బులు దక్కించుకునే అవకాశం దక్కింది.రెండు ఓటీటీ లకు వకీల్‌ సాబ్‌ ఇచ్చి దిల్‌ రాజు భారీ లాభాలను పొందాడు అంటున్నారు.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు