పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.అందులో ఇప్పటికే తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతం రీమేక్ గా రూపొందుతున్న సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
త్వరలో ఆ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.జూలై నెలలో ఆ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే.
ఇక క్రిష్ దర్శకత్వం లో హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu ) అనే సినిమా ని కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు.సగానికి పైగా ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.
ఇక సాహూ చిత్ర దర్శకుడు సుజీత్ దర్శకత్వం లో ఓ జీ( OG ) అనే సినిమా ను పవన్ కళ్యాణ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యాయి.భారీ బడ్జెట్ తో ఆ సినిమా ను రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.ఇక మైత్రి మూవీ మేకర్స్ వారు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) అనే సినిమా ను పవన్ కళ్యాణ్ హీరోగా నిర్మిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం లో గతంలో గబ్బర్ సింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.11 సంవత్సరాల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది.
ఈ నేపథ్యంలో అభిమానులతో పాటు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లిమ్స్ వీడియో అందరిని ఆకట్టుకుంది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలన్నింటిలోకి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కి ఉన్నంత క్రేజ్ మరే సినిమాకు లేదు అంటూ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.పాజిటివ్ టాక్ దక్కించుకుంటే చాలు రూ.100 కోట్ల కలెక్షన్స్ ఖాయం అంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.