NTR koratala Siva Movie Title: ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీకి పవన్ టైటిల్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు తాజాగా మొదలు కాగా ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని టైటిల్స్ వినిపించగా ప్రస్తుతం దేవర అనే టైటిల్ వినిపిస్తుండటం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.

 Pawan Kalyan Title Fixed For Ntr Koratala Shiva Combo Movie Details,  Koratala S-TeluguStop.com

బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో ఇదే టైటిల్ తో సినిమాను తెరకెక్కించాలని భావించిన సంగతి తెలిసిందే.

అయితే కొరటాల శివ మాత్రం తన సినిమా కథ ప్రకారం దేవర అనే టైటిల్ సూట్ అవుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

బండ్ల గణేష్ చాలా కాలం క్రితమే దేవర అనే టైటిల్ ను రిజిష్టర్ చేయించారు.అయితే ఈ విధంగా రిజిష్టర్ చేసిన టైటిల్స్ ను సినిమా తీసే వరకు రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది.

అయితే రెన్యూవల్ చేసుకోవడం బండ్ల గణేష్ మరిచిపోవడంతో కొరటాల శివ ఈ టైటిల్ ను రిజిష్టర్ చేయించారు.

అయితే ఎన్టీఆర్ సినిమాకు కొరటాల శివ ఈ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Telugu Bandla Genesh, Devara, Koratala Shiva, Ntr, Ntr Devara, Pawan Kalyan-Movi

బండ్ల గణేష్ ఈ టైటిల్ కు సంబంధించి కొరటాల శివపై సీరియస్ అయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.పవన్ మూవీ టైటిల్ ను ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీకి వాడితే తారక్ ఫ్యాన్స్ సైతం అంగీకరించే అవకాశాలు అయితే ఉండవని చెప్పవచ్చు.

Telugu Bandla Genesh, Devara, Koratala Shiva, Ntr, Ntr Devara, Pawan Kalyan-Movi

అతి త్వరలో ఈ టైటిల్ కు సంబంధించి మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది.ఎన్టీఆర్ సైతం ఈ టైటిల్ విషయంలో నో చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అయితే నిబంధనల ప్రకారమే కొరటాల శివ టైటిల్ ను రిజిష్టర్ చేయించుకున్న నేపథ్యంలో ఆయన ఈ టైటిల్ ను ఫిక్స్ చేసినా ఎలాంటి ఇబ్బందులు రావు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube