టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే.
ఒక సినిమా ఇంకా పూర్తవ్వకముందే వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు పవన్ కళ్యాణ్.క్రమంలోని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ను పూర్తి చేసే పనిలో పడ్డారు.
ఇప్పటికే ఈ సినిమా పూర్తి కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే.
అందుకు సంబంధించిన ప్రోమోని కూడా విడుదల చేశారు.కాగా పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఒక టాక్ షో కి వెళ్లడం అందులోనూ బాలయ్య బాబు హోస్టుగా వ్యవహరించడంతో ఆ ఎపిసోడ్ పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.
బాలయ్య బాబు ఎటువంటి ప్రశ్నలు అడగనున్నారు? పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించారు లాంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇక బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ ని నవ్వుతూ నవ్విస్తూనే చిక్కు ప్రశ్నలను కూడా వేసి గట్టిగానే సమాధానం రాబట్టినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బాలయ్య బాబు, పవన్ ని మూడు పెళ్లిళ్ల గురించి, టీడీపీ పొత్తు గురించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా బాలయ్య బాబు షోలో పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా వార్తల వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే బాలయ్య బాబు అన్న చిరంజీవి నుంచి ఏం నేర్చుకున్నారు అని అడగగా అన్నయ్య నుంచి కష్టపడే స్వభావం నేర్చుకున్నానని, దానివలన ఇప్పుడు ఇలా ఉన్నానని తెలిపాడట పవన్ కళ్యాణ్.అంతేకాకుండా వీటితోపాటు ఇంకా ఎన్నో రకాల విషయాలను ముచ్చటించినట్టు తెలుస్తోంది.మరి అవన్నీ తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే మరి.ఇటీవల పవన్ కళ్యాణ్ షోకి ఎంట్రీ ఇచ్చిన వీడియోని మాత్రమే విడుదల చేసింది ఆహా.ఇంతవరకు ఇటువంటి ప్రోమోని విడుదల చేయలేదు.







