తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో( Rajanagaram ) వారాహి విజయభేరి సభ( Varahi Vijayabheri Sabha ) నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) రాజమండ్రి ఎన్డీఏ కూటమి అభ్యర్థి పురందేశ్వరి( Purandeshwari ) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి జగన్ పై( CM Jagan ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజానగరం స్థానిక వైసీపీ నాయకులపై మండిపడ్డారు.అంతేకాకుండా తన చుట్టూ ఉన్నవారు ఎవరో తెలియాలనే పొగ పెట్టా.
అందరూ వైసీపీలోకి వెళ్లారు.పోలవరం పూర్తిచేసే బాధ్యత ఎన్డీఏ కూటమీదే.
పోలవరం ప్రాజెక్టుని అడ్డం పెట్టుకొని జగన్ ప్రభుత్వం ఏటీఎం మిషన్ లాగా వాడుకుందని కేంద్ర జలశాఖ మంత్రి గజేంద్ర షేకావత్… తనకు తెలియజేసినట్లు పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా తనపై గతంలో రాళ్లు విసిరినట్లు చెప్పుకొచ్చారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో… ఎన్నికల ప్రచారం చేస్తుండగా అనేక దాడులు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు.కానీ ఆ దాడులు తట్టుకున్నా .జగన్ లా డ్రామాలు ఆడలేదు.సినిమా టికెట్ ధరలు పెంచాలని వెళితే.
చిరంజీవిని( Chiranjeevi ) జగన్ అవమానించారంటూ పవన్ కామెంట్లు చేశారు.సినిమా ఇండస్ట్రీ మనుషులు వైఎస్ జగన్ కి పడదని చెప్పుకొచ్చారు.
రాబోయేది తమ ప్రభుత్వమేనని కాబట్టి పోలీసులు ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా సహకరించాలని పవన్ విజ్ఞప్తి చేశారు.