జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.ఈసారి పిఠాపురం( Pithapuram ) నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.2024 ఎన్నికలను పవన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఎట్టి పరిస్థితులలో వైసీపీ( YCP ) రెండోసారి అధికారంలోకి రాకూడదని.
భావిస్తున్నారు.ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా బీజేపీ…టీడీపీ పార్టీలు పొత్తులు పెట్టుకునేలా కీలక పాత్ర పోషించారు.
ఈ విషయంలో ఢిల్లీ బీజేపీ పెద్దలను ఒప్పించడంలో పవన్ సక్సెస్ అయ్యారు.ఇదిలా ఉంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.
పోలింగ్ కి ఇంక మూడు వారాలు మాత్రమే సమయం ఉంది.ఈ క్రమంలో కూటమి తరపున పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు.
![Telugu Ap, Janasena, Pawan Kalyan, Pawan Unhealthy, Tdpbjp-Latest News - Telugu Telugu Ap, Janasena, Pawan Kalyan, Pawan Unhealthy, Tdpbjp-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/04/Pawan-Kalyan-has-a-fever-in-his-lungs-Key-instructions-for-fans-and-party-leaders-detailsd.jpg)
మొన్నటిదాకా చంద్రబాబుతో( Chandrababu ) కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.మధ్యలో అస్వస్థతకు గురికావడం జరిగింది.కొద్దిపాటి జ్వరం రావడంతో.హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించుకోవడం జరిగింది.అయినా గాని పవన్ కళ్యాణ్ ఆరోగ్యం( Pawan Kalyan Health ) కుదుటపడలేదట.ఈ విషయాన్ని జనసేన పార్టీ( Janasena Party ) తెలియజేయడం జరిగింది.
ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో వీర మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీసుకోవలసిన జాగ్రత్తలు సూచించింది.
![Telugu Ap, Janasena, Pawan Kalyan, Pawan Unhealthy, Tdpbjp-Latest News - Telugu Telugu Ap, Janasena, Pawan Kalyan, Pawan Unhealthy, Tdpbjp-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/04/Pawan-Kalyan-has-a-fever-in-his-lungs-Key-instructions-for-fans-and-party-leaders-detailsa.jpg)
“జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి విజయభేరీ యాత్ర నేటి నుంచి నిరాటంకంగా కొనసాగుతుంది.రికరెంట్ ఇనుయంజా కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ముజేరి రోజు ఏదో ఒక సమయంలో జ్వరంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధపడుతున్నారు.ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయవద్దు.
అదే విధంగా కరచాలనాలు, ఫోటోల కోసం ఒత్తిడి చేయవద్దని మనవి.పూలు జల్లినప్పుడు నేరుగా ఆయన ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, అభిమానులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము” అంటూ పార్టీ సోషల్ మీడియా విభాగం పోస్ట్ చేయడం జరిగింది.