పవర్‌స్టార్‌పై పవన్ ఏమన్నాడో తెలుసా?

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

కాగా థియేటర్లు మూతపడటంతో తన సినిమాను ఓటీటీలో స్వయంగా,రిలీజ్ చేస్తూ తనదైన మార్క్‌ను క్రియేట్ చేస్తున్నాడు.

ఇక తాజాగా ‘పవర్ స్టార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న వర్మ, ఈ సినిమాను పవన్ కళ్యాణ్‌పై తెరకెక్కిస్తున్నాడు.అయితే ఈ సినిమాలో పవన్‌కు సంబంధించిన ఎలాంటి కథను వర్మ చూపిస్తాడా అని అందరూ అనుకున్నారు.

Pawan Kalyan Laughed On Power Star Movie, Pawan Kalyan, Power Star, RGV, Tollywo

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వర్మ రిలీజ్ చేయగా దానికి మంచి క్రేజ్ దక్కింది.పవన్ కళ్యాణ్‌లాగే ఉన్న వ్యక్తిని చూసి అందరూ షాక్ అయ్యారు.

ఇక ఈ సినిమాను ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాల తరువాత పవన్ ఏం చేశాడనే అంశంపై తెరకెక్కిస్తున్నాడు వర్మ.మొత్తానికి వర్మ ఈ సినిమాతో పవన్ రాజకీయ వైఫల్యాన్ని వ్యంగ్యంగా చూపించేందుకు సిద్ధపడ్డాడనే విషయం అర్థమవుతోంది.

Advertisement

ఇక ఇదే సినిమాలోని వర్కింగ్ స్టిల్‌ను కూడా వర్మ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.అయితే వర్మ రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్, స్టిల్‌ను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తిలకించినట్లు తెలుస్తోంది.

ఆయన ఈ పోస్టర్, స్టిల్స్‌ను చూసి నవ్వుకున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.మొత్తానికి పవర్ స్టార్ చిత్రంతో వర్మ రియల్ పవర్ స్టార్‌ను నవ్వించాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాను అతి త్వరలో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు వర్మ రెడీ అవుతున్నాడు.

అధిక బరువుతో వర్రీ వద్దు.. నిత్యం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే నెల రోజుల్లో సన్నబడతారు!
Advertisement

తాజా వార్తలు