పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తన కెరీర్ లో ఇప్పటి వరకు పోషించని పాత్ర ని ‘హరి హర వీరమల్లు’ సినిమాలో పోషిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు యూత్ , మాస్ మరియు ఫ్యామిలీ సినిమాలను చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్, ఒక్కసారిగా పీరియాడిక్ డ్రామా లో , డిఫరెంట్ గెటప్ లో కనిపించేసరికి ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా చాలా థ్రిల్ కి గురయ్యారు.
ఆ గెటప్ కూడా పవన్ కళ్యాణ్ కి బాగా సూట్ అయ్యింది.ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ లో రెండు గ్లిమ్స్ వీడియోస్ ని విడుదల చేసారు.
వాటికి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది.కరోనా ముందు వరకు ఈ చిత్రం జెట్ స్పీడ్ లో దూసుకుపోయింది.
కానీ కరోనా లాక్ డౌన్ తర్వాత నత్త నడకన సాగింది.లాక్ డౌన్ తర్వాత పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా( Bheemla Nayak )ని పూర్తి చేసాడు.

ఆ సినిమా విడుదలై పెద్ద హిట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు'( Hari Hara Veeramallu ) చిత్రానికి ఒక రెండు నెలల కాల్ షీట్స్ ఇచ్చారు.అందులో ఆయన 40 రోజులు షూటింగ్ లో పాల్గొన్నాడు.రోమాలు నిక్కపొడిచే రేంజ్ ఇంటర్వెల్ సన్నివేశం ని ఈ భారీ షెడ్యూల్ లో ప్లాన్ చేసారు.ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ జరగలేదు.
హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో ఎప్పటి నుండో వేసిన సెట్స్ ని కూడా పీకేశారు.పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి కాకుండా ‘బ్రో ది అవతార్'( Bro ), ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు ‘ఓజీ’ వంటి చిత్రాలకు డేట్స్ ఇచ్చాడు.
కానీ ‘హరి హర వీరమల్లు’ కి మాత్రం డేట్స్ ఇవ్వడం లేదు.అందుకు రెండు కారణాలు ఉన్నాయి.ఒకటి డైరెక్టర్ క్రిష్ ఇచ్చే పాత ఐడియాస్ పవన్ కళ్యాణ్ కి నచ్చడం లేదు.

ఈ సినిమా పట్ల పవన్ కళ్యాణ్ ఆలోచనలు మరియు క్రిష్ ఆలోచనలు కలవడం లేదు.మార్పులు చేర్పులు చేసుకొని రమ్మని చెప్పాడు, ఈలోపు పవన్ కళ్యాణ్ ట్రాక్ మారిపోయింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్'( Ustaad Bhagat Singh ) మరియు ‘ఓజీ’ చిత్రాలపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తున్నాడు.
అందుకు కారణం ఆ రెండు సినిమాలకు పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న పారితోషికం చాలా పెద్దది. ‘ఓజీ'( OG ) చిత్రానికి ఆయన దాదాపుగా వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు.
అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి 70 కోట్ల రూపాయిలు తీసుకుంటున్నాడు.కానీ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి కేవలం 40 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడు.అందుకే ఆయన ప్రాధాన్యతలు మారిపోయాయి, ఈ రెండు సినిమాలు పూర్తి అయితే కానీ ‘హరి హర వీరమల్లు’ వైపు చూడడు అని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.







