పవన్‌ మూవీ... మరింత కన్ఫ్యూజన్‌లో పెట్టిన బండ్ల గణేష్‌

పవన్‌ కళ్యాణ్‌ మొన్న జరిగిన అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ధారుణమైన పరాజయం పాలయిన విషయం తెల్సిందే.

కనీసం ఆయన పోటీ చేసిన వద్ద అయినా కూడా గెలువలేక పోయాడు.

రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల కూడా ఓడి పోవడం చాలా విచారకరం.రాజకీయాల్లో ఫ్లాప్‌ అయిన పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ సినిమాల్లోకి వస్తాడని అంతా భావిస్తున్నారు.

సమయంలోనే బండ్ల గణేష్‌ తాజాగా పవన్‌తో చర్చలు జరిపాడని, 100 కోట్ల మూవీకి ప్లాన్‌ చేస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది.ఆ వార్తల్లో నిజం ఎంత అంటూ బండ్ల గణేష్‌ను పెద్ద ఎత్తున ప్రశ్నించారు.

Pawan Kalyan Putting Bandla Ganesh In To Confusion

ఎట్టకేలకు బండ్ల గణేష్‌ స్పందించాడు.అయితే ఆయన స్పందన ప్రేక్షకులను మరింత కన్ఫ్యూజ్‌ చేసే విధంగా ఉంది.ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి, త్వరలోనే సినిమా విషయంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెంటనే ప్రకటిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement
Pawan Kalyan Putting Bandla Ganesh In To Confusion-పవన్‌ మూవీ

చర్చలు జరుగుతున్నాయని చెప్పడంతో పవన్‌ మూవీ విషయంలో బండ్ల గణేష్‌ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని అనిపిస్తుంది.

Pawan Kalyan Putting Bandla Ganesh In To Confusion

పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే మైత్రి వారి నుండి అడ్వాన్స్‌ తీసుకుని ఉన్నాడు.ఆయన అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వలేదు.కనుక మొదట పవన్‌ కళ్యాణ్‌ వారి బ్యానర్‌లో సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఒక వేళ పవన్‌ కనుక సినిమాలు చేయాలని ఫిక్స్‌ అయితే వెంటనే మైత్రి వారి బ్యానర్‌లోనే చేస్తాడని ఎక్కువ శాతం ప్రేక్షకులు భావిస్తున్నారు.సినీ వర్గాల్లో కూడా అదే చర్చ జరుగుతుంది.

మరి బండ్ల చేసే ప్రయత్నం ఏంటో, ఆయన ఏమైనా గుడ్‌ న్యూస్‌ చెప్తాడా అంటూ పవన్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

టూత్ పేస్ట్ పళ్లకే కాదు.. ఇలా కూడా వాడొచ్చు!!
Advertisement

తాజా వార్తలు