పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం వరుసగా చేస్తున్న సినిమాలలో అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం OG. సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతూన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగింది.
ఇప్పటికే 5 షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ముంబై లో ఆరవ షెడ్యూల్ కూడా జరుపుకోనుంది.పవన్ కళ్యాణ్ తన వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) పొలిటికల్ టూర్ లో బిజీ గా ఉన్నప్పటికీ, ఈ సినిమా షూటింగ్ ఆగలేదు.
పవన్ కళ్యాణ్ సినిమాలో లేని సన్నివేశాలను తెరకెక్కించారు.ఈ సన్నివేశాల చిత్రీకరణ మొత్తం పూర్తి అయ్యింది.
ఇక పవన్ కళ్యాణ్ మిగిలిన పోర్షన్ కి సంబంధించిన షూటింగ్ బ్యాలన్స్ ఉంది.ఈ నెల చివర్లో ఈ సినిమాకి డేట్స్ ని సర్దుబాటు చేసే అవకాశం ఉంది.
ఇకపోతే సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యబోతున్నారు మేకర్స్.
ముంబై షెడ్యూల్ లో జరిగిన ఒక యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన ఒక చిన్న ఫోటోని పవన్ కళ్యాణ్ ని చూపించిన పోస్టర్ తో సెప్టెంబర్ 2 వ తేదీన టీజర్( OG Teaser ) విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.ఈ పోస్టర్ కి 17 వేలకు పైగా రీ ట్వీట్స్ , 40 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.పవన్ కళ్యాణ్ నుండి చాలా కాలం తర్వాత రాబోతున్న ఒక స్ట్రెయిట్ సినిమా కావడం తో అభిమానులు కచ్చితంగా ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాస్తుంది అనే బలమైన నమ్మకం తో ఉన్నారు.
ఇకపోతే ఈ సినిమా టీజర్ లోని ఒక డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.ముంబై లో వర్షపాతం బాగా పెరిగిపోయింది అనే వార్త తో టీజర్ ప్రారంభం అవుతుంది.
ఆ తర్వాత ఓకే సీబీఐ ఆఫీసర్ జరిగిన మర్డర్స్ ని పరిశీలిస్తూ, వర్షపాతం కంటే ఇక్కడ రక్త ప్రవాహం ఎక్కువైంది, ఇన్ని మర్డర్లు చేసిన ఆ వ్యక్తి ఎవరు అని అంటాడు.అప్పుడు ఫైర్ బ్యాక్ గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ స్టైల్ గా చేతిలో గన్ పట్టుకొని నడుస్తూ వస్తాడు.ఇదే త్వరలో విడుదల అవ్వబోతున్న టీజర్ కంటెంట్.ఈ టీజర్ కట్ సిద్దమై చాలా కాలమే అయ్యింది, కేవలం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించాల్సిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్( Thaman BGM ) ఒక్కటే బ్యాలన్స్ ఉంది.
త్వరలోనే అది కూడా పూర్తి అయితే ఆడిపోయే రేంజ్ ఫస్ట్ లుక్ తో ఒక అప్డేట్ ఇవ్వడానికి సిద్ధం గా ఉంది మూవీ టీం.