హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) భేటీ అయ్యారు.ఇరువురి నాయకుల మధ్య పొత్తులకు సంబంధించి చర్చలు జరిగినట్లు సమాచారం.
గతంలో ఈ ఇద్దరు నాయకులు రెండుసార్లు ఒకరికొకరు పరామర్శల పేరుతో కలుసుకోవడం జరిగింది.అయితే ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్… సడన్ గా చంద్రబాబుతో బేటీ కావడంతో ఏపీలో రాజకీయ వాతావరణం వేగవంతంగా మారుతోంది.
ఈరోజు సాయంత్రం హైదరాబాదు నివాసంలో భేటి అయినా ఈ ఇరువురి మధ్య అనేక అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.

తాజా రాజకీయ పరిస్థితులు ఇంకా ప్రజా సమస్యలపై మాట్లాడుకున్నట్లు వినికిడి.ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాలపై కూడా చర్చలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.మూడోసారి భేటీ కావడంతో దాదాపు తెలుగుదేశం మరియు జనసేన పార్టీల మధ్య పొత్తు కన్ఫామ్ అనే టాక్ విశ్లేషకుల నుండి వినిపిస్తూ ఉంది.2014 ఎన్నికల సమయంలో టీడీపీ,బీజేపీ, జనసేన( TDP, BJP, Jana Sena ) పోటీ చేయటం జరిగింది.అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.2019 ఎన్నికల్లో మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేయగా జగన్ అధికారంలోకి రావడం జరిగింది.ప్రస్తుతం పవన్ మరియు బీజేపీ కూటమిగా ఉన్నారు.
టీడీపీతో బీజేపీ కటీఫ్ అన్నట్టు దూరం పెట్టడం జరిగింది.ఈ క్రమంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మూడోసారి సమావేశం కావటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.







