Janasena Pawan Kalyan : జనసేన ఎన్నికల నిర్వహణ కోసం పవన్ కళ్యాణ్ భారీ విరాళం..!!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలు( 2024 Elections ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలిచే అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు.

 Janasena Pawan Kalyan : జనసేన ఎన్నికల నిర్వహ-TeluguStop.com

గత ఎన్నికలలో భీమవరం, గాజువాక నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.అయితే ఈసారి పిఠాపురం నియోజకవర్గం( Pitahpuram Constituency ) నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

కచ్చితంగా పిఠాపురం నుండి తాను ఎమ్మెల్యేగా గెలవడం గ్యారెంటీ అని పవన్ భావిస్తున్నారు.అదేవిధంగా ఈనెల 30వ తారీకు నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.

వారాహి వాహనంతో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని పవన్ రెడీ అయ్యారు.పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటనలు చేపట్టబోతున్నారు.

పరిస్థితి ఇలా ఉండగా ఎన్నికలకు ఇంకా 50 రోజులు మాత్రమే సమయం ఉండటంతో పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.విషయంలోకి వెళ్తే ఎన్నికల నేపథ్యంలో పార్టీ నిర్వహణ అవసరాల కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు.సినిమాలపరంగా వచ్చే డబ్బును ప్రజల కోసం ఖర్చు చేస్తున్న ఆయన చాలావరకు పార్టీ కార్యక్రమాలకు.ఖర్చు పెడుతున్నారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ నేతల స్ఫూర్తితో తాను కష్టపడి సంపాదించిన డబ్బును పార్టీ కోసం అదే విధంగా ప్రజల కోసం ఖర్చు చేస్తూనే ఉంటానని అన్నారు.దీనిలో భాగంగా ఎన్నికల నిర్వహణ కోసం 10 కోట్ల రూపాయల చెక్కును జనసేన పార్టీ ట్రెజరీ రత్నం( Janasena Party Treasury ) గారికి అందజేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube