పవన్ రీ రిలీజ్ సినిమాకు ప్రీ రిలీజ్ వేడుక... మొదలైన మరో సరికొత్త ట్రెండ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ నడుస్తున్న విషయం మనకు తెలిసిందే.

హీరోల పుట్టినరోజు వేడుకలు కనుక వస్తే వారి సినీ కెరియర్లో సూపర్ హిట్ అందుకున్న చిత్రాలను తిరిగి విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే ఎంతో మంది హీరోల సినిమాలను తిరిగి విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నటించిన ఖుషి, జల్సా వంటి సినిమాలు విడుదలై అద్భుతమైన కలెక్షన్లను రాబట్టాయి.

తాజాగా ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా, రామ్ చరణ్ నటించిన ఆరెంజ్, అల్లు అర్జున్ నటించిన దేశముదురువంటి సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేశాయి.

ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ (Gudumba Shankar)సినిమాను తిరిగి విడుదల చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలను తిరిగి విడుదల అవుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతూ ఉండగా.

Advertisement

రీ రిలీజ్ సినిమాలకు ప్రీ రిలీజ్(Pre Release) వేడుకలను నిర్వహించడం సరికొత్త ట్రెండ్ గా నిలుస్తుందని భావిస్తున్నారు.సాధారణంగా ఒక సినిమా విడుదల అవుతుంది అంటే భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నటించిన గుడుంబా శంకర్ సినిమా తిరిగి విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం.ఇక ఈ వేడుకకు పలువురు దర్శక నిర్మాతలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ విషయం తెలిసిన పవన్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా మొదటిసారి 2004లో విడుదలైన పెద్దగా ఆదరణ సంపాదించుకోలేదు కానీ అప్పట్లో పవన్ కళ్యాణ్ రెండు ప్యాంట్లు ధరించడం ట్రెండ్ అయింది.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన మీరాజాస్మిన్ (Meera jasmin)నటించారు.

వీరశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు నాగబాబు(Nagababu) నిర్మాతగా వ్యవహరించారు మరి రీ రిలీజ్ తర్వాత ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటున్న తెలియాల్సి ఉంది.

నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్​గా పూజా
Advertisement

తాజా వార్తలు