పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రజెంట్ పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.పవన్ ఒకవైపు రాజకీయాలు.
మరో వైపు సినిమాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు.అయినప్పటికీ తీరిక లేకుండా షూటింగులతో పవన్ బిజీగా ఉన్నాడు.
పవర్ స్టార్ తన లైనప్ ను గ్యాప్ లేకుండా సెట్ చేసుకోవడమే కాకుండా వాటిని పూర్తి కూడా చేస్తున్నాడు.
మరి ఇప్పటికే ఈయన లైనప్ లో ఉన్న రీమేక్ సినిమాను పూర్తి చేసాడు.ఆ తర్వాత ఏప్రిల్ 5న హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమా స్టార్ట్ చేసాడు.ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి అవ్వగానే మరో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
మరి తాజాగా ఈ వార్తలు నిజం అయ్యేలా ఈయన ప్రకటించిన ఓజి సినిమా నుండి బ్లాస్టింగ్ అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్.
టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో ఓజి (OG Movie) అనే సినిమాను స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ రానుంది అని వైరల్ అవుతుంది.దీనిని నిజం చేస్తూ ఈ రోజు సాయంత్రం ఒక అదిరిపోయే యాక్షన్ వీడియోను రిలీజ్ చేసారు.
ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేయగా ఈ వీడియో నెక్స్ట్ లెవల్ లో ఉందని చెప్పాలి.
ఈ చిన్న వీడియో లోనే యాక్షన్ గాని వైలెన్స్ గాని ఏ లెవల్లో ఉంటాయో సుజీత్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది.ఈ సినిమా సుజిత్ కంప్లీట్ చేస్తున్నట్టుగా ఒక ఫుల్ పవర్ ప్యాక్డ్ వీడియోని మేకర్స్ లాంచ్ చేసారు.ఈ వీడియోతో ఈ సినిమా షూట్ స్టార్ట్ అయినట్టు కన్ఫర్మ్ అయ్యింది.
ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి ఎంటెర్టైనమెంట్స్ వారు నిర్మిస్తున్నారు.