సురేందర్ రెడ్డి కథని లాక్ చేసిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు.

ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఇప్పుడు రెండు సినిమాలు స్టార్ట్ చేశాడు.

అందులో సాగర్ చంద్ర దర్శకత్వంలో అయ్యప్పన్ కోశియమ్ ఒకటి కాగా, క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ మూవీ ఒకటి ఉంది.రెండు భిన్నమైన జోనర్స్, నేటివిటీ ఉన్న సినిమాలు ఒకే సారి పవన్ కళ్యాణ్ చేయడానికి రెడీ అయ్యాడు.

Pawan Kalyan Finalized Surendar Reddy Story, Tollywood, Telugu Cinema, Vakeel Sa

అయితే ఫస్ట్ ఏకే సినిమాలో తనకి సంబందించిన సన్నివేశాలు అన్ని పూర్తి చేసి క్రిష్ సినిమా చేయాలని అనుకుంటున్నారు.ఇక ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మరోసారి పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు.

ఇక ఈ సినిమా కథ కూడా ఇప్పటికే ఫైనల్ అయ్యింది.ప్రస్తుతం హరీష్ శంకర్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాడు.

Advertisement

దీని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.అప్పట్లో సురేందర్ రెడ్డి చెప్పిన స్టోరీ లైన్ విని పవన్ కళ్యాణ్ ఒకే చెప్పాడు.

ఇదిలా తాజాగా సురేందర్ రెడ్డి కంప్లీట్ స్క్రిప్ట్ ని పవన్ కళ్యాణ్ ని నేరేషన్ ఇచ్చాడని తెలుస్తుంది.ఇక పవన్ కళ్యాణ్ కథ మొత్తం విని దర్శకుడుకి ఒకే చెప్పి కథని లాక్ చేసినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం సురేందర్ రెడ్డి అఖిల్ తో సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నాడు.ఈ సినిమా పూర్తి చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ట్ చేస్తాడని తెలుస్తుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు