ఫొటోటాక్‌ : వకీల్‌ సాబ్‌ షూటింగ్‌ గ్యాప్‌లో జనసేన పనులు

పరవ్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ దాదాపు ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు.

ఈ ఆరు ఏడు నెలలుగా పవన్‌ పూర్తిగా గడ్డం మరియు పొడవైన జుట్టుతో మాత్రమే కనిపించాడు.

పవన్‌ ను ఆ లుక్‌ లో చూడలేక అభిమానులు చాలా ఇబ్బంది పడ్డాడు.ఒక బాబాగా ఏంటీ ఆ గడ్డం జుట్టు అంటూ అభిమానులు మనసులో అనుకుని ఉంటారు.

ఎట్టకేలకు పవన్‌ గత నాలుగు అయిదు రోజులుగా వకీల్‌ సాబ్‌ షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యాడు.పవన్‌ షూటింగ్‌ మొదలు పెట్టడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

మళ్లీ పవన్‌ పాత లుక్ కు రావడంతో అభిమానుల సంతోషానికి అవదులు లేకుండా పోయాయి.షూటింగ్‌ లొకేషన్‌ నుండి రెగ్యులర్‌ గా ఫొటోలు షేర్‌ అవుతూనే ఉన్నాయి.

Advertisement
Pawan Kalyan Doing His Janasena Party Work At Vakeel Saab Movie Shooting Gap, Pa

నిన్న కూడా ఒక ఫొటో వకీల్‌ సాబ్‌ సెట్‌ నుండి బయటకు వచ్చింది.ఫొటోలో పవన్‌ కళ్యాణ్‌ లాయర్‌ కాస్ట్యూమ్స్‌ లో ఉన్నాడు.

షాట్‌ గ్యాప్‌లో పవన్‌ కళ్యాణ్‌ తన జనసేన పార్టీ లెటర్‌ హెడ్స్‌ పై ఏదో సీరియస్‌గా రాస్తున్నాడు.అంటే షూటింగ్‌ గ్యాప్‌లో పిచ్చాపాటి మాట్లాడుకోకుండా పార్టీకి సంబంధించిన పనులు పవన్‌ చేసుకుంటున్నాడు.

దేని కోసమో ప్రెస్‌ నోట్ ను ఆయనే స్వయంగా రాస్తున్నాడో లేదంటే కార్యకర్తలకు పంపించాల్సిన సందేశాన్ని తయారు చేస్తున్నాడో అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాలు కూడా చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చిన పవన్‌ ఏకంగా ఆరు సినిమాలకు కమిట్‌ అయ్యాడు.

Pawan Kalyan Doing His Janasena Party Work At Vakeel Saab Movie Shooting Gap, Pa

ఆ సినిమాలన్నింటిని కూడా వరుసగా చేయబోతున్నాడు.ఈ నెల చివరి వరకు వకీల్‌ సాబ్‌ సినిమా పూర్తి కాబోతుంది.వచ్చే నెల నుండి క్రిష్‌ మూవీ పట్టాలెక్కబోతుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20

ఆ తర్వాత హరీష్‌ శంకర్‌, సురేందర్‌ రెడ్డి, మలయాళ అయ్యప్పన్‌ కోషియుమ్‌ రీమేక్‌ల్లో నటించాల్సి ఉంది.బండ్ల గణేష్‌ నిర్మాణంలో కూడా ఒక సినిమాను ఈయన చేసేందుకు కమిట్‌ అయ్యాడు.

Advertisement

మొత్తానికి పార్టీ పనులతో బిజీగా ఉన్నా కూడా డబ్బు కోసం సినిమాల్లో నటించాలని భావించి ముందుకు వచ్చిన పవన్‌కు అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.

తాజా వార్తలు