తాట తీస్తా అంటున్న జనసేనాని ! ఏంటి సంగతి ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ ఏ సమావేశంలో మాట్లాడినా ఖచ్చితంగా ఏదో ఒక అంశం బాగా హైలెట్ అవ్వడం లేక వివాదాస్పదం అవ్వడం జరుగుతోంది.

ప్రస్తుతం పవన్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టాడు.

అందుకే పార్టీ నాయకులతో తరచూ సభలు సమావేశాలు పెడుతూ పార్టీని పటిష్టం చేసేందుకు కృషిచేస్తున్నాడు.నిన్న పవన్ సొంత జిల్లా భీమవరంలో కూడా పార్టీ సమావేశం నిర్వహించారు.

దీని నిమిత్తం రాజముండ్రి నుంచి పవన్ రోడ్డు మార్గం ద్వారా భీమవరం చేరుకున్నారు.ఈ సందర్భంగా పవన్ చాలా ఆవేశంగా మాట్లాడారు.

దీనికి కారణం కూడా ఉంది అందేంటి అంటే తెలంగాణ ఉద్యమం గురించి పవన్‌ కల్యాణ్‌ కించపరిచేలా మాట్లాడారంటూ ఆయన ఇంటి ముందు, జనసేన తెలంగాణ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఆందోళన నిర్వహించారు.

Advertisement

ఇంతకీ విషయం ఏంటి అంటే తెలంగాణ ఉద్యమంతా తాగుడుతో ముడిపడి ఉందని ఉద్యమకారులు, గిరిజనులను కించపరిచేలా పవన్‌ కల్యాణ్‌ ఓ సభలో మాట్లాడారని, పవన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు.పవన్‌కల్యాణ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు కూడా ఆందోళనకారులు ఫిర్యాదు చేశారు.దీనిపై భీమవరం సభలో పవన్ ఘాటుగా స్పందించారు.

నేను తెలంగాణలో ఎవరినో కించపరిచేలా మాట్లాడానట.అదీ కూడా ఐదు రోజుల క్రితం.

అయితే నేను మాట్లాడింది వేరు, వారు చెప్పేది వేరు.ఎప్పడో ఐదు రోజుల క్రితం మాట్లాడితే దాన్ని ఈ రోజు ప్రస్తావిస్తూ భీమవరంలో నా కార్యక్రమం హైలైట్‌ అవకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ పవన్ మండిపడ్డారు.

అసలు నేను మాట్లాడిన విషయం జగన్‌ చెప్పిన మద్యపాన నిషేధం అంశానికి సంబంధించింది.పుచ్చలపల్లి సుందరయ్య రాసిన తెలంగాణ సాయుధ పోరాటం పుస్తకంలో చదివిన అంశాన్ని ప్రస్తావించాను.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 

మద్యపానం అనేది కొన్ని గిరిజన తెగల్లో, కొన్ని రాష్ట్రాల్లో సంస్కృతిలో భాగంగా ఇమిడిపోయిందని అన్నాను.ప్రజల నుంచి సంస్కృతిని వేరు చేయలేం కాబట్టి మద్యపాన నిషేధం చేయడం కష్టమవుతుందన్నాను.

Advertisement

తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు మద్యపాన నిషేధం ఎందుకు చేయలేమన్నప్పుడు, అది వారి సంస్కృతిలో భాగంగా భావించారు.మన గిరిజనులు ఇప్ప పువ్వు నుంచి సారా తీస్తారు.

అది వారి సంస్కృతి.వద్దన్నా ఆగరు.

ఇలా నేను మాట్లాడింది ఒకటైతే వారు మరోరకంగా అర్ధం చేసుకుంటూ ‘ఇళ్లమీదకి వస్తాం, ఆఫీసుల మీదకు వస్తాం అంటే చూస్తూ ఊరుకోను తాట తీస్తా అంటూ పవన్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

తాజా వార్తలు