మీ ముగ్గురు ఒకవైపు .. నేను ఒకవైపు ! పవన్ ఛాలెంజ్ !

టీడీపీ కంచుకోటలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన మాటలకు పదును పెట్టాడు.రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన తన ప్రస్తుతం పర్యటిస్తున్నారు.

 Pawan Kalyan Challenges Jagan Naidu Lokesh For Debate-TeluguStop.com

తాజాగా భీమవరంలో బహిరంగ సభలో మాట్లాడిన పవన్ టీడీపీ, వైసీపీలపై విరుచుకుపడ్డారు.యనమదుర్రు డ్రెయిన్ ఎలా కంపుకొడుతున్నదో ఆ పార్టీల అవినీతి కూడా అలా కంపు కడుతోందని విమర్శించారు.

ఒకప్పుడు అన్నపూర్ణగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లా నేడు పంటలు లేక విలవిలలాడుతోందని, తాగే నీరు కూడా లేక అల్లాడుతోందని విచారం వ్యక్తం చేసారు.

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, వైసీపీ అధినేత జగన్ లకు సవాల్ విసిరారు.”నేను ప్రజా సమస్యల గురించి మాట్లాడితే నన్నెవరో తప్పుదోవ పట్టిస్తున్నారని చంద్రబాబు, లోకేశ్ లు వ్యాఖ్యలు చేస్తున్నారు.చంద్రబాబు, లోకేశ్, జగన్మోహన్ రెడ్డి గారికి.

ముగ్గురికి నేను ఛాలెంజ్ చేస్తున్నా.పశ్చిమగోదావరి జిల్లాపై ఓ మీటింగ్ పెట్టండి.

నేను వస్తాను.మాట్లాడతాను.

ఆ డిస్కషన్ భీమవరంలో జరగాలి.మీ ముగ్గురూ ఒకవైపు ఉండండి.

నేనొక్కడినే ఒకవైపు ఉంటాను’ అని పవన్ ఆవేశంగా సవాల్ విసిరారు.

ప్రస్తుత టీడీపీ ప్రభుత్వానికి ప్రజాగ్రహం చూసి భయం వేస్తోందని, అందుకే సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తోందని ఒక వేళా ఎన్నికలు నిర్వహించినా ఓడిపోతామనే భయం ఆ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని చెప్పి.ఆ ఎన్నికలు కూడా నిర్వహించరా? అని ప్రశ్నించారు.15 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన జిల్లాకి కనీసం ఒక డంపింగ్ యార్డును కూడా ఏర్పాటు చేయలేని టీడీపీ గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు.తాను పబ్లిక్ పాలసీ గురించి మాట్లాడితే తన వ్యక్తిగత జీవితం గురించి జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు.

జగన్ మోహన్ రెడ్డిగారు.మీరు అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు.యనమదుర్రు డ్రెయిన్, తాగునీరు లేకపోవడం, ఆక్వా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడమని చెబితే.నన్ను తిడతారు.

మీ వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడగలను.మీరు తట్టుకోలేనంత విమర్శలు చేయగలను అని పవన్ హెచ్చరించారు.

తన జీవితం తెరిచిన పుస్తకం అని, ఎలాంటి దాపరికాలు లేవని పవన్ అన్నారు.ఎవరూ ఆకాశం నుంచి దిగిరాలేదన్నారు.

ఫ్యాక్షనిస్టులకు భయపడేది లేదని తనదైన శైలిలో చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube